మరోసారి రాష్ట్రంలో భారీ వర్షాలు.. కలెక్టర్లతో సీఎం సమీక్ష

by Mahesh |
మరోసారి రాష్ట్రంలో భారీ వర్షాలు.. కలెక్టర్లతో సీఎం సమీక్ష
X

దిశ, వెబ్‌డెస్క్: బంగాళఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత వారం కురిసిన భారీ వర్షాల కారణంగా వరదల నుంచి ప్రజలు తేరుకునే లోపే మరోసారి భారీ వర్షాలు కురుస్తున్నాయి. అల్పపీడనం కారణంగా.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు కురవనుండగా.. జిల్లాల కలెక్టర్లతో సీఎం చంద్రబాబు నాయుడు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సమయంలో సీఎంకు కలెక్టర్లు ఆయా జిల్లాలో నమోదైన వర్షపాతం వివరాలతో పాటు నష్టంపై కూడా వివరించారు. కాగా అధికారులు ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, ఉత్తరాంధ్ర జిల్లాలపై వర్షాల ప్రభావం అధికంగా కనిపిస్తోందని సీఎం అన్నారు. రాష్ట్రంలోని ఆయా జలాశయాలు ఇప్పటికే నిండుకుండలా మారాయని.. స్టోరేజ్ కెపాసిటీ అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాలని.. ప్రతి ఒక్కరు సమర్థవంతంగా ప్రాజెక్టుల నిర్వాహణ చేపట్టాలని.. కాలువలు, చెరువులు, డ్రెయిన్లకు గండ్లు పడకుండా చూడాలని, కురుస్తున్న వర్షాలకు అనుగుణంగా ప్రజలను నిరంతరం అప్రమత్తం చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు కాలెక్టర్లకు, ఇతర శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో పాటుగా నాగావళి, వంశధార నదులకు వరద పెరిగే అవకాశం ఉందని, అంచనాలకు అనుగుణంగా అధికారులు తగు చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు.

Advertisement

Next Story

Most Viewed