- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
CM Chandrababu:‘బర్త్ డే రోజే ఆయన్ను వేధించారు’.. గత ప్రభుత్వం పై సీఎం చంద్రబాబు ఫైర్
దిశ,వెబ్‌డెస్క్: ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్(AP Assembly Deputy Speaker)గా ఎన్నికైన ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు(MLA Raghuramakrishnam Raju) ఇవాళ మధ్యాహ్నం బాధ్యతలు చేపట్టారు. ఈ క్రమంలో ఆయనను సీఎం చంద్రబాబు(CM Chandrababu), డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) సీట్లో కూర్చోబెట్టారు. ఈ నేపథ్యంలో రఘురామకృష్ణం రాజును మంత్రి లోకేష్, ఇతర మంత్రులు ఎమ్మెల్యేలు అభినందించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. శాసనసభ డిప్యూటీ స్పీకర్‌గా ఎన్నికైన ప్రోగ్రామాకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ నేపథ్యంలో గత ప్రభుత్వం గురించి సీఎం చంద్రబాబు మాట్లాడుతూ ఆగ్రహం వ్యక్తం చేశారు. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజు పై దేశ ద్రోహం కేసు పెట్టి, పుట్టినరోజే అరెస్ట్ చేశారని వైసీపీ ప్రభుత్వం పై సీఎం చంద్రబాబు మండిపడ్డారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు కల్మషం లేని వ్యక్తి అని కొనియాడారు. రాజుది సూటిగా మాట్లాడే వ్యక్తిత్వం అని.. అదే ఆయనకు ఇబ్బందులు తెచ్చింది అన్నారు. గత ఐదేళ్లు ఆయన పై వైసీపీ కక్షగట్టింది అని పేర్కొన్నారు. సినిమాల్లో ‘RRR’ఎంత సంచలనమో రాజకీయాల్లో ఈ ‘ఆర్‌ఆర్‌ఆర్’ అంతే అని వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో స్పీకర్ కుర్చీకే ఆయన నిండుతనం తెచ్చారు అని సీఎం ప్రశంసించారు.