Gautham Adani: రిటైర్ అయ్యేలోపు ధారావీ ప్రాజెక్టును పూర్తి చేస్తా: గౌతమ్ అదానీ

by Maddikunta Saikiran |
Gautham Adani: రిటైర్ అయ్యేలోపు ధారావీ ప్రాజెక్టును పూర్తి చేస్తా: గౌతమ్ అదానీ
X

దిశ, వెబ్‌డెస్క్: అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ(Gautham Adani) మహారాష్ట్ర(MH) రాజధాని ముంబై(Mumbai)లోని అతిపెద్ద మురికివాడగా పేరు పొందిన ధారావీ(Dharavi) ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ ప్రాంతాన్ని డెవలప్ చేయడానికి అదానీ దాదాపు 3 బిలియన్ డాలర్లను(ఇండియన్ కరెన్సీలో సుమారు రూ. 300 కోట్లు) ఖర్చు చేయనున్నారు. ఈ ప్రాజెక్టులో భాగంగా ఒక్కో ఫ్యామిలీకి 350 చదరపు అడుగుల ఫ్లాట్స్(Flats) ను అదానీ ఉచితంగా కట్టివ్వాల్సి ఉంటుంది. మహారాష్ట్ర గవర్నమెంట్ 2022లో ఈ ప్రాజెక్టు కోసం 250 ఎకరాల ల్యాండ్(Land)ను అదానీకి అప్పగించింది. ఇదిలా ఉంటే.. తాను రిటైర్(Retire) అయ్యేలోపు ఈ ప్రాజెక్టును పూర్తి చేసి తీరుతానని పేర్కొన్నారు. ఈ మేరకు ఓ ప్రముఖ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ(Interview)లో ధారావీ ప్రాజెక్టపై తనకున్న చిత్తశుద్ధి గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. పది లక్షల మంది ప్రజల జీవితాలను మెరుగుపరచడం ద్వారా ఒక లెగసీని ఎలా క్రియేట్ చేయవచ్చో నిరంతరం ఆలోచిస్తానని అన్నారు. ప్రస్తుతం తనకు 62 ఏళ్లు ఉన్నాయని, రిటైర్ అయ్యేలోపు ధారావీ ప్రాజెక్టును పూర్తి చేస్తానని పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed