- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తిరుపతిలో జూనియర్ లైన్‌మెన్ల మహా ధర్నా.. డిమాండ్లు ఇవే...
దిశ, తిరుపతి: విద్యుత్ ఉద్యోగులు, కార్మికుల విషయంలో ప్రభుత్వం మోసపూరితంగా ప్రవర్తించిందని సీపీఎం నేత కందారపు మురళి అన్నారు. తిరుపతి ఎస్పీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయం వద్ద ఎనర్జీ అసిస్టెంట్ జేఎల్ఎం గ్రేడ్ 2 ఉద్యోగులు చేపట్టిన మహాధర్నాకు ఆయన మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా మురళి మాట్లాడుతూ ఎన్నికలకు ముందు జగన్ ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేయలేదన్నారు. ఎనర్జీ అసిస్టెంట్‌లుగా పిలువబడుతున్న జూనియర్ లైన్ మెన్ గ్రేడ్ 2గా పని చేస్తున్న వారి పట్ల ప్రభుత్వం వివక్ష చూపుతుందని మండిపడ్డారు. రిక్రూట్‌మెంట్ నేరుగా డిస్కంలే చేపట్టినప్పటికీ విద్యుత్ ఉద్యోగులకు వర్తించే సర్వీసు నిబంధనలు అమలు చేయడంలేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఒక డిపార్ట్‌మెంట్‌లో రెండు రకాల సర్వీసు నిబంధనలు ఏంటని ప్రశ్నించారు. ప్రమాదకరమైన విద్యుత్ విభాగంలో పని చేస్తున్న జేఎల్ఎం ఉద్యోగుల సమస్యలను పరిష్కారం చేయడంలో ప్రభుత్వం విఫలమైందని మురళి ఆరోపించారు.
కాగా ధర్నాకు ముందు తిరుపతి శ్రీనివాస కళ్యాణం మండపాల నుంచి సీఎండీ కార్యాలయం వరకు కార్మికులతో భారీ ప్రదర్శనను నిర్వహించారు. అనంతరం ఎస్పీడీసీఎల్ డైరెక్టర్ సుబ్బరాజుకు వినతిపత్రం సమర్పించారు. తమ పరిధిలోని సమస్యలు తక్షణం పరిష్కరిస్తామని, విధానపరమైన అంశాలు రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తామని, సిఎండి ఢిల్లీ వెళ్ళినందున వచ్చిన వెంటనే ఈ సమస్యల చర్చించి పరిష్కారించేందుకు ప్రయత్నం చేస్తామని సుబ్బరాజు వివరించారు.