- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
థాంక్యూ అన్నా అంటూ.. పవన్ కల్యాణ్‌కు నారా లోకేష్ స్పెషల్ ట్వీట్
దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్(Pawan Kalyan)కు మంత్రి నారా లోకేష్(Nara Lokesh) కృతజ్ఞతలు చెప్పారు. ఈ మేరకు సోషల్ మీడియా(ఎక్స్) వేదికగా ట్వీట్ పెట్టారు. రాష్ట్రంలో విద్యారంగాన్ని సమూలంగా ప్రక్షాళన చేస్తున్నారని నారా లోకేష్‌ను ప్రశంసిస్తూ పవన్ కల్యాణ్ ట్వీట్ పెట్టారు. దీనికి లోకేష్ స్పందించారు. థాంక్యూ పవన్ అన్నా అంటూ రిప్లై ఇచ్చారు. ఇదిలా ఉండగా.. అంతకుముందు మంత్రి నారా లోకేష్ ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. యువగళం పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన హామీని నెరవేర్చారు.
లోకేష్ చిత్తూరు జిల్లా కుప్పం నుంచి యువగళం.. మనగళం నినాదంతో పాదయాత్ర ప్రారంభించారు. ఇలా పాదయాత్ర పూర్తయిన ప్రతి వంద కిలో మీటర్ల దగ్గర ఒక శిలాఫలకాన్ని ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. మొదటి వంద కిలోమీటర్లు మైలురాయిని చిత్తూరు జిల్లా బంగారుపాళ్యంలో పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా రాష్ట్రంలో తమ ప్రభుత్వం వచ్చిన 100 రోజుల్లో గ్రామంలో డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటుచేస్తామని లోకేష్ శిలాఫలకంలో పొందుపరిచి ఆవిష్కరించారు. మంత్రి హోదాలో ఇచ్చిన మాట ప్రకారం వంద రోజుల్లో ఇక్కడి ప్రభుత్వ ఆస్పపత్రిలో డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు.