- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అంబేద్కర్, శ్రీకృష్ణదేవరాయలు, బాలయోగి పేర్లు పెట్టండి: ముద్రగడ లేఖ
దిశ, ఏపీ బ్యూరో : రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి వైసీపీ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. 13 జిల్లాల స్థానంలో 26 జిల్లాలు ఏర్పాటు చేసేందుకు మంత్రి మండలి మంగళవారం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో బుధవారం గెజిట్ నోటిఫికేషన్ విడుదలైంది. అంతేకాదు జిల్లాలకు సంబంధించిన పేర్లు, లేదా ఇతర అంశాలపై అభ్యంతరాలను ఫిబ్రవరి 26 వరకు స్వీకరిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం సీఎం వైఎస్ జగన్‌కు లేఖ రాశారు. ప్రభుత్వం జిల్లాల పెంపు ప్రతిపాదన గురించి ప్రస్తావించారు. అయితే జిల్లాల పెంపును స్వాగతిస్తున్నారా లేదా అనేది స్పష్టంగా తెలపలేదు.
'మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 13 జిల్లాలను 26 జిల్లాలుగా మార్పుకి తమరు శ్రీకారం చుట్టారని పత్రికలలో చూశానండి.. అంటూ పేర్కొన్నారు. నాదొక చిన్న మనవి దయచేసి అవకాశం ఉంటే మనసుపెట్టి పెద్దల పేర్లు పలు జిల్లాలకు పెట్టడానికి పరిశీలించమని కోరుచున్నాను. తూర్పు లేక పశ్చిమగోదావరిలో ఒక జిల్లాకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు.. ఏదో ఒక జిల్లాకు శ్రీకృష్ణదేవరాయలు పేరు పెట్టాలని.. కోనసీమకి లోక్‌సభ స్పీకర్ స్వర్గీయ జీఎంసీ బాలయోగి పేరు పెట్టాలని నా విన్నపం' అంటూ లేఖలో పేర్కొన్నారు.