- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తిరుమలలో మరో 8 ప్రాథమిక చికిత్స కేంద్రాలు
by M.Rajitha |
X
దిశ, వెబ్ డెస్క్ : తిరుమలలో జరగనున్న బ్రహ్మోత్సవాల కోసం మరో 8 ప్రాథమిక చికిత్స కేంద్రాలను టీటీడీ ఏర్పాటు చేసింది. రానున్న సాలకట్ల బ్రహ్మోత్సవాలకు లక్షల్లో హాజరయ్యే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఈ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే తిరుమలలో 6 ప్రాథమిక చికిత్స కేంద్రాలు, 6 డిస్పెన్సరీలు ఉండగా.. అదనంగా మరో 8 ప్రాథమిక చికిత్స కేంద్రాలను ఏర్పాటు చేస్తూ టీటీడీ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా వీటిని నారాయణగిరి పార్కులో రెండు, తరిగొండ వెంగమాంబ అన్నదాన సత్రం, శిలా తోరణం, రాంబగీచ గెస్ట్ హౌస్, 7వ మైలు, పాపనాశనం, బాట గంగమ్మ ఆలయం వద్ద ఒక్కొక్కటి చొప్పున ఏర్పాటు చేస్తున్నారు. కాగా సాలకట్ల బ్రహ్మోత్సవాలు అక్టోబర్ 4 నుండి 12 వరకు జరగనున్నాయి.
Advertisement
Next Story