పరిశుభ్రతకు ప్రాధాన్యం..క్షేత్ర స్థాయిలో మురుగు ప్రక్షాళనలో పాల్గొన్న ఎమ్మెల్యే

by Jakkula Mamatha |
పరిశుభ్రతకు ప్రాధాన్యం..క్షేత్ర స్థాయిలో మురుగు ప్రక్షాళనలో పాల్గొన్న ఎమ్మెల్యే
X

దిశ, నరసరావుపేట:ఇళ్ల ముందు చెత్త గానీ, కాలువల్లో మురుగు కానీ కనిపించని విధంగా ప్రణాళికలు రచిస్తున్నట్లు నరసరావుపేట ఎమ్మెల్యే డా౹౹చందలవాడ అరవింద బాబు అన్నారు. ఈ మేరకు నరసరావుపేట పట్టణంలోని 24, 25, 26, 33 వార్డులలో ప్రత్యేక శానిటేషన్ డ్రైవ్ నిర్వహించారు. పలు ప్రాంతాల్లో కాలువల్లోని చెత్తను తొలగించారు. దోమల నివారణ కోసం ఫాగింగ్ చేపట్టారు. ప్రజల ఆరోగ్యానికి మించిన ప్రాధాన్యం తనకు ఏమీ లేదన్నారు. గతంలో జగన్ రెడ్డి ప్రజల ప్రాణాల కన్నా తనకు దోపిడీ కాసుల వేట ముఖ్యంగా వ్యవహరించారని, ఫలితంగా ప్రజలు అవస్థలు పడాల్సి వచ్చిందన్నారు. ప్రజలు కూడా పారిశుద్ధ్యానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలని అన్నారు. రోడ్ల పై చెత్త వేయకుండా చూసుకోవాలన్నారు. ప్లాస్టిక్ నివారణకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. ప్రజలు సహకరిస్తే ఆరోగ్య నరసరావుపేట సాకారం చేసి చూపిస్తానని ఎమ్మెల్యే డా౹౹చందలవాడ అరవింద బాబు అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రవిచంద్ర రెడ్డి,పారిశుధ్య కార్మికులు,టీడీపీ శ్రేణులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed