ఆ జిల్లా పేరు మార్చండి.. సీఎంకు మంత్రి సత్యకుమార్ లేఖ

by srinivas |   ( Updated:2024-10-04 13:18:11.0  )
ఆ జిల్లా పేరు మార్చండి.. సీఎంకు మంత్రి సత్యకుమార్ లేఖ
X

దిశ, వెబ్ డెస్క్: వైఎస్సార్ కడప జిల్లా పేరును మార్చాలంటూ సీఎం చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu)కు మంత్రి సత్యకుమార్ యాదవ్(Minister Satyakumar Yadav) లేఖ రాశారు. వైఎస్సార్‌ (Ysr) పేరును తొలగించి కడప జిల్లా(Kadapa District)గా మార్చాలని లేఖలో ఆయన కోరారు. కలియుగ దైవం వెంకటేశ్వరుడి సన్నిధికి చేరడానికి తొలి గడప కడప అని, అలాంటి పేరుకు ఒక చారిత్రక నేపథ్యం, ఆధ్యాత్మిక ప్రాశస్త్యం ఉందని సత్యకుమార్ తెలిపారు. వీటిపట్ల మాజీ సీఎం జగన్(Former CM Jagan)కు కనీస అవగాహన లేదని విమర్శించారు. పేర్ల పిచ్చితో జిల్లాను వైఎస్సార్ జిల్లాగా మార్చడం తప్పు అని చెప్పారు. కడప జిల్లా ప్రజల మనోభావాల మేరకు ఆ జిల్లా పేరును గెజిట్‌లో మార్పులు చేసి గతంలో జరిగిన తప్పును సరిదిద్దాలని సీఎం చంద్రబాబును సత్యకుమార్ యాదవ్ లేఖలో కోరారు.

Advertisement

Next Story

Most Viewed