- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
మమ్మల్ని మన్నించండి కామ్రేడ్స్: మంత్రి నారా లోకేశ్
X
దిశ, వెబ్ డెస్క్: సీఎం చంద్రబాబు మడకశిర నియోజకవర్గం పర్యటన సందర్భంగా ఆ ప్రాంత సీపీఎం నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై మంత్రి నారా లోకేశ్ స్పందించారు. సీపీఎం నేతలు తమను మన్నించాలని కోరారు. గృహనిర్బంధాలు, ముందస్తు అరెస్టులకు కూటమి ప్రభుత్వం పూర్తిగా వ్యతిరేకమన్నారు. గత ఐదేళ్ల పరదాల ప్రభుత్వం పోయినా ఇంకా కొంత మంది పోలీసుల తీరు మారలేదని నారా లోకేశ్ చెప్పారు. ఇటువంటి అప్రజాస్వామిక అరెస్టులను పునరావృతం కానివ్వమని తెలిపారు. ప్రభుత్వాన్ని ప్రజాపక్షమై ప్రశ్నించే హక్కు, ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపే హక్కులను కాపాడతామన్నారు. ఇకపై ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు ముందస్తు అరెస్టులు, గృహనిర్బంధాలు లాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని పోలీసు శాఖ ముఖ్య అధికారులకు నారా లోకేశ్ విజ్ఞప్తి చేశారు.
Advertisement
Next Story