Nara Lokesh :విచారణలో తప్పని తేలితే దోషులు, బాధ్యులపై కఠిన చర్యలు తప్పవు: నారా లోకేశ్ కీలక హెచ్చరిక

by Anjali |
Nara Lokesh :విచారణలో తప్పని తేలితే దోషులు, బాధ్యులపై కఠిన చర్యలు తప్పవు: నారా లోకేశ్ కీలక హెచ్చరిక
X

దిశ, వెబ్‌డెస్క్: కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ గర్ల్స్ హాస్టల్‌లో హిడెన్ సీసీ కెమెరాలు పెట్టారని విద్యార్థినులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనా వారం కిందటే వెలుగులోకి వచ్చినా నిర్వహకులు పట్టించుకోవడం లేదని కళాశాల యాజమాన్యంపై మండిపడుతున్నారు. తాజాగా ఈ ఘటనపై మంత్రి నారా లోకేశ్ స్పందించారు. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కళాశాలలో అర్ధరాత్రి విద్యార్థినుల ఆందోళనపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నానని తెలిపారు. హిడెన్ కెమెరాల ఆరోపణలపై విచారణకు ఆదేశించానని వెల్లడించారు. విచారణలో తప్పు చేశారని తేలితే దోషులు, బాధ్యులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇటువంటి ఘటనలు కాలేజీల్లో పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు ఆదేశాలు ఇచ్చానని అన్నారు. కళాశాలల్లో ర్యాగింగ్, వేధింపులు లేకుండా యాజమాన్యాలు ముందస్తు చర్యలు తీసుకోవాలని చూచించారు. ఈ అంశం ఇప్పటికే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విచారణకు ఆదేశించారు. హాస్టల్ లో రహస్య కెమెరాలు ఉన్నాయనే విద్యార్థినుల ఆందోళనపై విచారణ జరపాలని ఆదేశించారు. తక్షణమే జిల్లా మంత్రి కొల్లు రవీంద్రతో పాటు జిల్లా కలెక్టర్, ఎస్పీ లను ఘటనా స్థలానికి వెళ్లాలని ముఖ్యమంత్రి తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed