Tirumala laddu:తిరుమల లడ్డూ వివాదంపై స్పందించిన మంత్రి లోకేష్ .. సెన్సేషనల్ కామెంట్స్!

by Jakkula Mamatha |
Tirumala laddu:తిరుమల లడ్డూ వివాదంపై స్పందించిన మంత్రి లోకేష్ .. సెన్సేషనల్ కామెంట్స్!
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో ప్రస్తుతం తిరుమల లడ్డూ(Tirumala Laddu) ప్రసాదం పై వివాదం రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. గత ప్రభుత్వ హయాంలో తిరుమల లడ్డూ తయారీలో జంతువుల కొవ్వు వాడారని సీఎం చంద్రబాబు(Chandrababu) చేసిన ఆరోపణలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఈ ఘటనపై వైసీపీ, టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ క్రమంలో తిరుమల లడ్డూ ప్రసాదం వివాదం పై మంత్రి నారా లోకేష్(Nara Lokesh) స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. లడ్డూలో నాణ్యత తగ్గిందని.. లడ్డూల తయారీలో కల్తీ నెయ్యి వాడినట్లు తమ దగ్గర ఆధారాలు ఉన్నాయని కల్తీ నెయ్యి కమిషన్లను రికవరీ చేసి శ్రీవారి హుండీలో వేయిస్తామని మంత్రి నారా లోకేష్‌ చెప్పారు.

గత ప్రభుత్వ హయాంలో టీటీడీలో జరిగిన అవినీతిపై తాము స్పష్టమైన ఆరోపణలు చేశామన్నారు. నెయ్యిని NDDFకు పంపిస్తే జంతువుల కొవ్వు పదార్థాలతో తయారు చేసిన నూనె ఉందని నిర్ధారించారని తెలిపారు. ఈ నేపథ్యంలో తిరుపతిలో కల్తీ నెయ్యికి(adulterated ghee) కారణమైన ఏ ఒక్కరినీ వదిలి పెట్టబోమని మంత్రి నారా లోకేష్‌ హెచ్చరించారు. ‘ఇప్పుడు నేను తిరుపతిలోనే ఉన్నా.. దమ్ముంటే తిరుపతి వచ్చి ప్రమాణం చేయాలి’ అంటూ వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డికి మంత్రి లోకేష్ సవాల్ విసిరారు. ‘వైవీ సుబ్బారెడ్డి అహంకార ధోరణితో మాట్లాడుతున్నారు.. ఐదేళ్లూ ఏం చేశారు’ అని ఆయన ప్రశ్నించారు. ఈ క్రమంలో తిరుమల పవ్రితతను తాము కాపాడతామని హామి ఇచ్చారు. కొత్తగా వచ్చిన టీటీడీ ఈవో లడ్డూ నాణ్యతను(Quality) పెంచారన్నారు. వైసీపీ ప్రభుత్వంలో చట్టాన్ని ఉల్లంఘించిన వారు తన రెడ్‌ బుక్‌ చూస్తే భయపడుతున్నారని మంత్రి లోకేష్ వ్యాఖ్యానించారు.

Advertisement

Next Story

Most Viewed