AP News:‘ఎవరిని కదిలించినా కన్నీళ్లే’..మంత్రి లోకేష్ ఎమోషనల్ ట్వీట్!

by Jakkula Mamatha |
AP News:‘ఎవరిని కదిలించినా కన్నీళ్లే’..మంత్రి లోకేష్ ఎమోషనల్ ట్వీట్!
X

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రంలో ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ కూటమి ఘన విజయం సాధించి..నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో కూటమి ప్రభుత్వం రాష్ట్రాభివృద్ధి పై ప్రత్యేక దృష్టి పెట్టింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అమలు చేస్తానన్న హామీల అమలు పై ప్రత్యేక ఫోకస్ పెట్టారు. ఏపీ మంత్రి లోకేష్ ప్రజా దర్బార్ కార్యక్రమం ద్వారా ప్రజల సమస్యలు తెలుసుకుని పరిష్కరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా నారా లోకేష్ భావోద్వేగ ట్వీట్ చేశారు. ‘గత ఐదేళ్ల వైసీపీ పాలనలో ప్రజా సమస్యలను పట్టించుకోలేదు. దీని ఫలితంగా రాష్ట్రంలో ఏ ఒక్కరిని కదిలించినా కష్టాలు, కన్నీళ్లే కనిపిస్తున్నాయి. ప్రజాదర్బార్‌లో ప్రజల నుంచి విన్నపాలు వెల్లువెత్తాయి’ అని మంత్రి లోకేష్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆయా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చాను అని మంత్రి లోకేష్ పేర్కొన్నారు.

Advertisement

Next Story