చంద్రబాబుపై ఫైబర్ గ్రిడ్ కేసులో కీలక అప్డేట్.. ఏసీబీ కోర్టులో మెమో దాఖలు

by Javid Pasha |
చంద్రబాబుపై ఫైబర్ గ్రిడ్ కేసులో కీలక అప్డేట్.. ఏసీబీ కోర్టులో మెమో దాఖలు
X

దిశ, వెబ్‌డెస్క్: టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై నివేదిక అందజేయాలని కోరుతూ ఆయన తరపు న్యాయవాదులు ఇటీవల ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన జడ్జి.. కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా సీఐడీకి ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఇవాళ ఏసీబీ కోర్టులో సీఐడీ కౌంటర్ దాఖలు చేసింది. మంగళవారం సాయంత్రం కౌంటర్ దాఖలు చేయడంతో రేపు పిటిషన్ విచారణకు వచ్చే అవకాశముంది.

చంద్రబాబు ఆరోగ్యానికి సంబంధించి వైద్యులు, జైలు అధికారులు ఎలాంటి నివేదికలు కుటుంబసభ్యులకు ఇవ్వడం లేదని పిటిషన్ దాఖలైంది. బాబు ఆరోగ్యంపై కుటుంబసభ్యులు, టీడీపీ శ్రేణుల్లో ఆందోళన నెలకొందని, హెల్త్ బులిటెన్ విడుదల చేయడం లేదని పేర్కొన్నారు. ఆరోగ్య పరిస్థితిపై నివేదికలు ఎప్పటికప్పుడు విడుదల చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఈ నెల 12 తర్వాత ఎలాంటి నివేదికలు ఇవ్వలేదని పిటిషన్‌లో పేర్కొన్నారు.

అటు ఫైబర్ నెట్ వ్యవహారంలో చంద్రబాబు కేసుకు సంబంధించి ఏసీబీ కోర్టులో సీఐడీ మెమో దాఖలు చేసింది. ఈ కేసులో చంద్రబాబును కోర్టు ముందు హాజరుపర్చమని తెలిపింది. ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ శుక్రవారానికి వాయిదా పడింది. అప్పటివరకు బాబును ఏసీబీ కోర్టులో హాజరుపర్చవద్దని సీఐడీకి సుప్రీంకోర్టు సూచించింది. దీంతో సుప్రీం తదుపరి ఆదేశాల వచ్చేంతవరకు కోర్టుకు తీసుకెళ్లమని సీఐడీ మెమో సమర్పించింది.

Advertisement

Next Story

Most Viewed