జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించి.. అర్హులందరికీ అక్రిడిటేషన్లు ఇవ్వాలి: ఐజేయూ జాతీయ సమితి నాయకులు

by Anjali |
జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించి.. అర్హులందరికీ అక్రిడిటేషన్లు ఇవ్వాలి: ఐజేయూ జాతీయ సమితి నాయకులు
X

దిశ ప్రతినిధి, కర్నూలు: జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని ఐజేయూ జాతీయ సమితి నాయకులు జి.కొండప్ప, కె.నాగరాజు, ఏపీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఈఎన్.రాజు, కె.శ్రీనివాస గౌడ్ లు కోరారు. ఈ మేరకు మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారిగా శనివారం జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయ సమావేశ భవనంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్‌ను ఐజేయూ, ఏపీయూడబ్ల్యూజే నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే పూలమాలలు వేసి శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వైసీపీ ప్రభుత్వ హయాంలో చాలామంది జర్నలిస్టులకు అక్రిడిటేషన్లు రాలేదని, కొత్త ప్రభుత్వంలోనైనా అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్లు వచ్చేలా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. అలాగే అర్హులైన ప్రతి జర్నలిస్టుకు మూడు సెంట్లు స్థలం ఇస్తామని గత ప్రభుత్వం హామీచ్చిందని, అయితే అది అందుబాటులోకి రాలేదన్నారు. ఈ ప్రభుత్వంలోనైనా అర్హులైన ప్రతి జర్నలిస్టుకు ఇళ్ల స్థలాలు అందేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. అందుకు మంత్రి టీజీ భరత్ సానుకూలంగా స్పందించారు. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని హామీచ్చారు. కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే జిల్లా కోశాధికారి అంజి, సీనియర్ స్టాఫ్ రిపోర్టర్ హరి కిషన్, జిల్లా కార్యవర్గ సభ్యులు చిరంజీవి, వీడియో జర్నలిస్టు సంఘం అధ్యక్షులు స్నేహాల్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed