- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Srisailam Dam:చేపల కోసం శ్రీశైలం డ్యాం దగ్గర పెద్ద ఎత్తున మత్స్యకారులు
దిశ ప్రతినిధి,శ్రీశైలం ప్రాజెక్ట్:శ్రీశైలం జలాశయం దిగువన చేపల వేటకు మత్స్యకారుల సందడి నెలకొంది. గత నెలలో ఎగువ నుంచి వస్తున్న భారీ వరదలతో జులై 29న శ్రీశైలం జలాశయం 10 రేడియల్ క్రెస్ట్ గేట్లు ఎత్తి దిగువ నాగార్జునసాగర్‌కు అధికారులు నీటిని విడుదల చేశారు. ఈ నేపథ్యంలో గత 14 రోజులుగా మత్స్యకారుల చేపల వేటను వెళ్లవద్దని ఎగువ నుంచి వరద ప్రవాహం ఎక్కువగా ఉందని జలాశయం అధికారులు మత్స్యకారుల చేపల వేటను నిషేధించారు. అయితే శ్రీశైలం జలాశయానికి ఎగువ నుంచి వరద ప్రవాహం పూర్తిగా తగ్గడంతో నిన్న సాయంత్రం రేడియల్ క్రెస్టు గేట్లు మొత్తం జలాశయం అధికారులు మూసివేశారు.
ఒక్కసారిగా గేట్లు మూయడంతో మత్స్యకారులు జలాశయం దిగువన పుట్టిలలో చేపల వేటకు వందల పుట్టిలతో జలాశయం ముందు భాగానికి వెళ్లారు. సుమారు 13,14 రోజులుగా జలాశయం గేట్లు ఎత్తడంతో మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని వరద ప్రవాహం ఉధృతి ఎక్కువగా ఉండటంతో అధికారులు చేపల వేటను నిషేధించారు. అయితే జలాశయం వరద ప్రవాహం నిన్నటికి తగ్గడంతో గేట్లు మూశారు దీంతో మత్స్యకారులు ఆనందంతో వందల సంఖ్యలో పుట్టిలతో చేపల వలలు సిద్ధం చేసుకుని చేపల వేట మొదలుపెట్టారు పుట్టిలతో జలాశయం దిగువన తిరుగుతున్న మత్స్యకారుల వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.