Nandyala: 19న డోన్‌లో సీఎం పర్యటన

by srinivas |   ( Updated:2023-09-13 16:42:39.0  )
Nandyala: 19న డోన్‌లో సీఎం పర్యటన
X

దిశ, నంద్యాల: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల 19న డోన్‌లో పర్యటించనున్నారు. దీంతో పకడ్బందీగా ఏర్పాట్లు చేపట్టాలని జిల్లా కలెక్టర్ డా. మనజీర్ జిలాని సామూన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సీయం పర్యటన ఏర్పాట్లపై కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో ఎస్పీ రఘువీర్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ టి. రాహుల్ కుమార్ రెడ్డిలతో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ నెల 19న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి క్రిష్ణగిరి మండలం లక్కసాగరం వద్ద 74 చెరువులకు నీటిని నింపే పంప్ హౌస్ ప్రారంభోత్సవం, డోన్‌లో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారన్నారు. ఇందుకు సంబంధించి సీఎం పర్యటన ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టేందుకు పక్కా ప్రణాళిక రూపొందించుకొని ఆ మేరకు పనులు చేపట్టి సీఎం పర్యటనను విజయవంతం చేయాలని అధికారులకు సూచించారు. ప్రొటోకాల్ ప్రకారం అధికారులకు అప్పగించిన పనులు బాధ్యతాయుతంగా చేపట్టి ఎలాంటి లోపాలు లేకుండా పూర్తి చేయాలన్నారు. హెలిప్యాడ్ నుంచి బహిరంగ సభ వేదిక వరకు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీకి సూచించారు.

హెలిప్యాడ్ ల్యాండ్ అయ్యే ప్రదేశంలో ప్రొటోకాల్ ప్రకారం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి దుమ్ము లేవకుండా వాటరింగ్ పెద్దఎత్తున చేయాలని ఆర్‌అండ్‌బి, అగ్నిమాపక అధికారులను ఆదేశించారు. విద్యుత్ అంతరాయం లేకుండా నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయడంతో పాటు అవసరమైన జనరేటర్లను సిద్ధంగా ఉంచుకోవాలని ఏపీఎస్పీడీసీఎల్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. హెలిప్యాడ్, మీటింగ్ సమీపాల్లో ఏర్పాటు చేసిన సేఫ్ రూముల్లో అత్యవసర మందులతో పాటు నిపుణులైన డాక్టర్లు సిద్ధంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని డిఎంహెచ్ఓ, జిల్లా ఆసుపత్రి వైద్యాధికారులను ఆదేశించారు. గ్రీన్ రూమ్, సభా వేదిక, విజిటర్స్ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ఆహార పదార్థాలలో కల్తీ లేకుండా జాగ్రత్తగా చెక్ చేయాలని ఫుడ్ సేఫ్టీ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. సభా వేదిక ప్రాంతంలో ప్రాపర్‌గా త్రాగునీటి వసతి, మొబైల్ టాయిలెట్లు ఏర్పాటు చేయాలని డోన్ మున్సిపల్ కమిషనర్, ఆర్డబ్ల్యూఎస్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు.

Advertisement

Next Story

Most Viewed