- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నా తండ్రి వ్యాఖ్యలు పట్టించుకోవద్దు.. నేను Jagan వెన్నంటే ఉంటా..!
- టికెట్ ఇస్తే పోటీ చేస్తా లేదంటే గెలుపునకు కృషి చేస్తా
- - ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్
దిశ, డైనమిక్ బ్యూరో: తండ్రి చేసిన వ్యాఖ్యలకు కొడుకు కెరీర్‌ను ఇబ్బందుల్లోకి నెట్టేసింది. దీంతో తనయుడు తండ్రికి వార్నింగ్ ఇచ్చారు. తండ్రి చేసిన వ్యాఖ్యలను ఖండించారు. అయినప్పటికీ అధిష్టానం వెనక్కితగ్గలేదు. వివరణ ఇవ్వాలని ఆదేశించింది. దీంతో తనయుడు తండ్రి చేసిన వ్యాఖ్యలకు వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చిన పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితిని ఎదుర్కోంది వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్. సొంత ప్రభుత్వంలో కమ్మ సామాజిక వర్గానికి, అమరావతి రాజధానికి జరుగుతున్న అన్యాయంపై ఎమ్మెల్యే తండ్రి మాజీ హోంమంత్రి వసంత నాగేశ్వరరావు చేసిన వ్యాఖ్యలు రాజకీయాల్లో కలకలం రేపాయి. ఈ నేపథ్యంలో బుధవారం ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డితో భేటీ అయ్యారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డిని కలిసి వివరణ ఇచ్చారు.
వైసీపీని వదులుకోను
మాజీహోంమంత్రి వసంత నాగేశ్వరరావు వ్యాఖ్యలతో తనకు ఎలాంటి సంబంధం లేదని తనయుడు, వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ అన్నారు. తన తండ్రి వ్యాఖ్యలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని తెలిపారు. పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జలతో భేటీ అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. తాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని చెప్పారు. మళ్లీ ఎమ్మెల్యేగానే పోటీ చేస్తానని.. టికెట్ ఇవ్వని పక్షంలో ఎమ్మెల్యే అభ్యర్థి గెలుపునకు కృషి చేస్తానని చెప్పుకొచ్చారు. అంతేకానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనికానీ.. వైఎస్ జగన్‌ను కానీ వదులుకునే ప్రసక్తే లేదని ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ పేర్కొన్నారు.
రాజకీయమంతా వసంత వ్యాఖ్యల చుట్టూనే..
ఇదిలా ఉంటే వసంత నాగేశ్వరరావు వ్యాఖ్యలపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతుంది. కమ్మ సామాజిక వర్గం బాగుకోసమే నాగేశ్వరరావు వ్యాఖ్యలు చేశారని కొందరంటుంటే.. ఇన్నాళ్లు ఏం చేశారని వైసీపీకి చెందిన నేతలు కౌంటర్ ఇస్తున్నారు. కమ్మ సామాజిక వర్గానికి అనేక రంగాలలో గత ప్రభుత్వాలు మోసం చేశాయని అప్పుడు వసంత నాగేశ్వరరావు ఏం చేశారని నిలదీస్తు్న్నారు. ఈ పరిణామాలన్నీ పరిశీలిస్తుంటే వచ్చే ఎన్నికల్లో వసంత ఫ్యామిలీ పోటీ చేయదంటూ కూడా ప్రచారం జరుగుతుంది. అయితే దీన్ని వసంత కృష్ణప్రసాద్ ఖండించారు. ఇదిలా ఉంటే వైఎస్ జగన్‌కు ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ మంచి స్నేహితులు. ఇరువురికి వ్యాపార సంబంధాలు సైతం ఉన్నాయి. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కాకముందు నుంచి మంచి సంబంధాలు ఉన్నాయి. ఆ సంబంధాల నేపథ్యంలోనే వారు వైసీపీలో చేరారు. అనంతరం 2019 ఎన్నికల్లో మైలవరం నుంచి పోటీ చేసి అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే జగన్ అధికారంలోకి రాగానే వసంతకు మంత్రి పదవి వస్తుందని ఆశించారు. కానీ దక్కలేదు. కేబినెట్ విస్తరణలో కొడాలి నాని స్ధానంలో తనకు మంత్రి పదవి ఇస్తారని కృష్ణప్రసాద్ పెట్టుకున్న ఆశలు సైతం ఆవిరయ్యాయి. ఈ పరిణామాలతోనే వసంత నాగేశ్వరరావు వ్యాఖ్యలు చేశారంటూ వార్తలు వినిపిస్తున్నాయి.
Read more:
జగన్‌కు ఫిర్యాదు చేస్తా.. మంత్రి జోగి రమేశ్‌కు ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ వార్నింగ్
మంత్రి మల్లారెడ్డి ఇంట్లో పని మనిషికి ఫిట్స్.. హూటాహుటిన ఆసుపత్రికి తరలింపు