- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ముంబై నటి కేసులో సంచలన విషయాలు.. ఆ ముగ్గురిపైనే స్టేట్‌మెంట్
దిశ, వెబ్ డెస్క్: ముంబై నటి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. వైసీపీ నేత విద్యాసాగర్‌పై చేసిన ఫిర్యాదుపై విజయవాడలో నటి జత్వానీని పోలీసులు రెండు రోజులపాటు విచారించారు. ఈ విచారణలో ఆమె పలు కీలక విషయాలను పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. తన కుటుంబ సభ్యులు కూడా కార్ప్‌కు వాంగ్మూలం ఇచ్చారు. వైసీపీ నేత విద్యాసాగర్ రావు మోసం చేయడంతో తాను ముంబైలో ఫిర్యాదు చేశానని జత్వానీ తెలిపారు. అయితే ఆ కేసును మూయించేందుకు తనపై రాష్ట్రంలో అక్రమంగా కేసులు నమోదు చేశారని జత్వానీ చెప్పారు.
తనపై అక్రమంగా కేసు పెట్టడమే కాకుండా తన కుటుంబ సభ్యులను సైతం వేధించారని బాధితురాలు జత్వానీ పేర్కొన్నారు. విజయవాడ నుంచి 15 మంది పోలీసులు ముంబై వచ్చారని బాధితురాలు తెలిపారు. రాష్ట్రంలో తనపై అక్రమంగా కేసులు పెట్టడం వెనుక అప్పటి సీపీ కాంతిరాణా, మరో ఐపీఎస్ విశాల్ గున్ని, పీఎస్‌ఆర్ ఆంజనేయులు ఉన్నారని స్పష్టం చేశారు. ఈ మొత్తం వ్యవహారం వెనుక చాలా పెద్ద కుట్ర జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. తనపై విద్యాసాగర్ చెబుతున్న హనీట్రాప్ ఆరోపణలు అవాస్తవమని ముంబై నటి జత్వానీ పేర్కొన్నారు.