Vijayawada: ఐటీ ఉద్యోగులకు షాక్.. రోడ్లపైకి రావొద్దని హెచ్చరిక

by srinivas |
Vijayawada: ఐటీ ఉద్యోగులకు షాక్.. రోడ్లపైకి రావొద్దని హెచ్చరిక
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్ట్‌కు నిరసనగా ఐటీ ఉద్యోగులు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. చంద్రబాబుకు సంఘీభావం తెలుపుతూ ఇటీవల హైదరాబాద్‌లో ఐటీ ఉద్యోగులు నిరసన వ్యక్తం చేశారు. కార్ల ర్యాలీ నిర్వహించారు. తాజాగా విజయవాడ నుంచి రాజమండ్రి వరకు ఆదివారం కార్ల ర్యాలీకి ప్లాన్ చేసినట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో విజయవాడ పోలీసులు అప్రమత్తమయ్యారు. చంద్రబాబుకు మద్దతుగా ఐటీ ఉద్యోగులు తలపెట్టే కార్ల ర్యాలీకి అనుమతి లేదని విజయవాడ సీపీ కాంతిరాణా హెచ్చరించారు. ఎన్టీఆర్ జిల్లా కమిషనరేట్ పరిధిలో ర్యాలీలు, ప్రదర్శనలకు ఎలాంటి అనుమతులు లేవని.. ఎవరైనా అతిక్రమిస్తే చట్ట పరంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

Advertisement

Next Story

Most Viewed