VJA: విజయవాడలో మరో స్టార్ హోటల్.. 18న ప్రారంభం

by srinivas |
VJA: విజయవాడలో మరో  స్టార్ హోటల్.. 18న ప్రారంభం
X

​దిశ, ఏపీ బ్యూరో: స్టార్ హోటల్స్ స్థాపనలో ప్రపంచ వ్యాప్తంగా ప్రఖ్యాతి గాంచిన “హయత్ ప్లేస్” విజయవాడలో నాలుగు నక్షత్రాల హోటల్​ స్థాపించనుంది. ఈ కార్యక్రమానికి సీఎం జగన్​ హాజరవుతున్నట్లు చైర్మన్ రామిశెట్టి వీరాస్వామి తెలిపారు. ఈమేరకు బుధవారం తాడేపల్లి ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో హయత్ ప్లేస్ మేనేజింగ్ డైరెక్టర్ ఆర్ సాయి కార్తీక్, జనరల్ మేనేజర్ చింతల రామకృష్ణ, చైర్మన్ వీరాస్వామి సీఎంను కలిసి ఆహ్వానించారు.


విజయవాడ ఏలూరు రోడ్డు గుణదల ఇఎస్ఐ ఆసుపత్రి సెంటర్ సమీపంలో నూతనంగా నిర్మించిన హయత్ ప్లేస్ ఫోర్త్ స్టార్ హోటల్‌ను అత్యాధునిక హంగులతో ఏర్పాటు చేస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా అన్ని ప్రధాన పట్టణాల్లో హయత్ ప్లేస్ స్టార్ హోటల్స్​ ఉన్నాయి.

Advertisement

Next Story

Most Viewed