- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
విజయవాడలో Bjp ధర్నా.. Pakistan మంత్రి దిష్టి బొమ్మ దహనం
దిశ,డైనమిక్ బ్యూరో: పాకిస్తాన్ విదేశాంగ మంత్రి బిలావల్ బుట్టోపై ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యూయార్క్‌లో భారతదేశం, ప్రధాని నరేంద్రమోదీపై అనుచిత వ్యాఖ్యలు చేయడంపై ఆయన మండిపడ్డారు. బిన్ లాడెన్ చనిపోయినా ఇంకా వ్యక్తి బతికే ఉన్నాడని బుట్టో వ్యాఖ్యలను దేశం హర్షించదంటూ హితవు పలికారు. పాకిస్తాన్ విదేశాంగ మంత్రి బిలావల్ బుట్టో వ్యాఖ్యలకు నిరసనగా విజయవాడ బీజేపీ కార్యాలయం నుంచి లెనిన్ సెంటర్ వరకు నిరసన ప్రదర్శన నిర్వహించారు. పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పాకిస్తాన్ విదేశాంగ మంత్రి బిలావల్ బుట్టో దిష్టి బొమ్మను బీజేపీ నేతలు దహనం చేశారు.
అనంతరం సోము వీర్రాజు మాట్లాడుతూ పాకిస్తాన్‌కు చెందిన వ్యక్తులు అనుచిత వ్యాఖ్యలు మానుకోవాలని సూచించారు. పాకిస్తాన్ భూ భాగంలోకి వెళ్ళి దాడులు నిర్వహించామని.. అయినా బుద్ధి మార్చుకోకపోతే ఎట్టా అని సోము వీర్రాజు ప్రశ్నించారు. ప్రధాని నరేంద్ర మోదీపై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని భారత జాతికి బిలావల్ బుట్టో క్షమాపణలు చెప్పాలని నిలదీశారు. భారత్ చాలాసార్లు పాక్‌పై దాడి చేస్తే తోకముడిచారు. ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే పాకిస్తాన్ గుండెల్లో భారత్ నిద్రపోతుందంటూ తీవ్రంగా హెచ్చరించారు. పాకిస్తాన్ విదేశాంగ మంత్రి అత్యంత హేయమైన భాషను వినియోగించారని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణు వర్ధన్‌రెడ్డి ఆరోపించారు.