- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఏపీ హైకోర్టు రోస్టర్‌లో కీలక మార్పులు
దిశ, డైనమిక్ బ్యూరో :ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రోస్టర్‌లో కీలకమైన మార్పులు చోటు చేసుకున్నాయి. ఇటీవలే నలుగురు కొత్త న్యాయమూర్తుల రావడంతో చీఫ్ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ రోస్టర్‌లో మార్పులకు శ్రీకారం చుట్టారు. న్యాయమూర్తులు జస్టిస్ మండవ కిరణ్మయి, జస్టిస్ జగడం సుమతి, జస్టిస్ న్యాపతి విజయ్‌లు ఇటీవలే జడ్జిలుగా బాధ్యతలు చేపట్టారు. దీంతో సీనియర్ న్యాయమూర్తుల పక్కన కొత్తవారికి చోటు కల్పించారు. ఈమేరకు న్యాయమూర్తి జస్టిస్ తల్లాప్రగడ మల్లికార్జునరావుకు అత్యంత కీలకమైన బెయిల్ పిటిషన్లపై విచారణ బాధ్యతలను అప్పగించారు. జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ఆదేశాలతో 2019 నుంచి దాఖలైన క్రిమినల్ రివిజన్ పిటిషన్లు, ప్రజాప్రతినిధులకు సంబంధించిన పిటిషన్లను తల్లాప్రగడ మల్లికార్జునరావులు పరిశీలించనున్నారు. అయితే ఇప్పటివరకు బెయిల్ పిటిషన్లపై విచారణ జరిపిన జస్టిస్ కంచిరెడ్డి సురేష్ రెడ్డి ఇకపై ఎఫ్ఐఆర్‌లు, ఛార్జిషీట్‌లను కొట్టివేయాలంటూ 2017 వరకు దాఖలు చేసిన క్రిమినల్ పిటిషన్లపై విచారణ జరపనున్నారు.వీటితోపాటు 2018 నుంచి దాఖలైన క్రిమినల్ అప్పీళ్లను జస్టిస్ కంచిరెడ్డి సురేశ్ రెడ్డి విచారించనున్నారు.
సోమవారం నుంచే అమల్లోకి
మరోవైపు క్వాష్ పిటిషన్ల విచారణ బాధ్యతను జస్టిస్ బీఎస్ భానుమతికి అప్పగించారు. ఎఫ్ఐఆర్‌లను కొట్టివేయాలంటూ 2022 తర్వాత దాఖలైన వ్యాజ్యాలపై జస్టిస్ బీఎస్ భానుమతి విచారించనున్నారు. ఇదిలా ఉంటే ఇప్పటివరకు క్వాష్ పిటిషన్లపై విచారణ చేపట్టిన జస్టిస్ కొనకంటి శ్రీనివాసరెడ్డికి 2017 వరకు దాఖలైన క్రిమినల్ అప్పీళ్లు, కంపెనీ కేసులు, ఒరిజినల్ సివిల్ సూట్‌ల కేసుల బాధ్యతలు అప్పగించారు.ఇకపోతే కీలకమైన సాధారణ పరిపాలన శాఖకు సంబంధించిన కేసులను జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లుకు అప్పగించారు.మరోవైపు పురపాలక శాఖ, ఏపీసీఆర్‌డీఏ, ఏఎంఆర్‌డీఏ కేసులను జస్టిస్ సత్తి సుబ్బారెడ్డి, రెవెన్యూ, భూసేకరణ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖల కేసులను జస్టిస్ చీమలపాటి రవిలకే చీఫ్ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ అప్పగించారు. జస్టిస్ ప్రతాప వెంకట జ్యోతిర్మయికి చార్జిషీట్లు, ఎఫ్ఐఆర్‌ల బాధ్యతను కొట్టేయాలంటూ 2020, 2021 సంవత్సరాల్లో దాఖలైన పిటిషన్లపై విచారణను అప్పగించారు.ఈ రోస్టర్‌లో మరిన్ని మార్పులు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కొత్త రోస్టర్ సోమవారం నుంచి అమలులోకి రానున్నట్లు తెలుస్తోంది.