Kadambari Jethwani: ముంబై నటి జెత్వానీ కేసులో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

by Maddikunta Saikiran |   ( Updated:2024-10-01 17:29:15.0  )
Kadambari Jethwani: ముంబై నటి జెత్వానీ కేసులో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
X

దిశ, వెబ్‌డెస్క్:ముంబై(Mumbai)కి చెందిన సినీనటి కాదంబరీ జెత్వానీ(Kadambari Jethwani)పై ఏపీ పోలీసులు అక్రమకేసు పెట్టి వేధించిన విషయం తెలిసిందే.వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్‌(Kukkala Vidyasagar)తో పాటు ఐపీఎస్‌ అధికారులు,కాంతిరాణా(Kanthirana),పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు(PSR Anjaneyulu),విశాల్‌ గున్నీ(Vishal Gunny)లు తనపై అక్రమ కేసు పెట్టి, అరెస్టు చేశారని జెత్వానీ ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్(Ibrahimpatnam Police Station)లో ఫిర్యాదు చేశారు.ఈ కేసులో ఇప్పటికే ప్రధాన నిందితుడు కుక్కల విద్యాసాగర్‌ను పోలీసులు అరెస్ట్ చేయగా,ముగ్గురు ఐపీఎస్‌ అధికారులపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసి సస్పెన్షన్ వేటు వేశారు.

ఇదిలా ఉంటే.. ఈ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.ఈ కేసు దర్యాప్తును సీఐడీ(CID)కి ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం(AP Govt) భావిస్తోంది. ఈ కేసు రెండు తెలుగు రాష్ట్రాల్లో దర్యాప్తు చేయాల్సి ఉండటంతో సీఐడీకి ఇవ్వాలని ప్రభుత్వానికి అధికారులు సూచించారు. న్యాయ నిపుణుల సలహా తీసుకుని ఈ వ్యవహారంపై ఈ రోజు లేదా రేపటిలోగా ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చే అవకాశం ఉంది. సీఎం చంద్రబాబు(CM Chandrababu) వద్ద జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో ఈ కేసుపై చర్చించినట్లు తెలుస్తోంది.ఈ కేసులో సీనియర్ పోలీస్ అధికారుల ప్రమేయం ఉండటం, అలాగే ఈ కేసుకి ముంబై లింక్‌ల నేపథ్యంలో సీఐడీకు ఇవ్వడం బెటర్ అని ప్రభుత్వం అనుకుంటున్నట్లు సమాచారం.

Advertisement

Next Story

Most Viewed