- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
KA Paul: చిరంజీవి, పవన్ కళ్యాణ్ లు ప్యాకేజీ స్టార్స్.. కేఏ పాల్ హాట్ కామెంట్స్

దిశ, వెబ్ డెస్క్: చిరంజీవి, పవన్ కళ్యాణ్ లు ప్యాకేజీ స్టార్స్ అని, కాపులు అందరూ వీరిని వెలివేయాలని ప్రజాశాంతి పార్టీ(Prajashanthi Party) అధ్యక్షుడు కేఏ పాల్(KA Paul) అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ రాజకీయాల గురించి ప్రస్తావించారు. వైఎస్ షర్మిల(YS Sharmila) ప్యాకేజీ స్టార్(Package Star) కాదా అని, వైఎస్ రాజశేఖర్ రెడ్డిని చంపింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి, అన్నపై ఫైట్ చేసేందుకు ఏపీకి వచ్చి ప్యాకేజీ స్టార్ అయ్యిందని విమర్శించారు. అలాగే పవన్ కళ్యాణ్(Pawan Kalyan) టీడీపీ(TDP), బీజేపీ(BJP)లకు ప్యాకేజీ స్టార్ లా మారాడని, చిరంజీవి(Chiranjeevi) కూడా కాంగ్రెస్ పార్టీకి ప్యాకేజీ స్టార్ అయ్యాడని సంచలన వ్యాఖ్యలు చేశారు.
కాపులందరూ ప్యాకేజీ స్టార్ లా మారిన చిరంజీవి, పవన్ కళ్యాణ్ లను వెలివేయాలా వద్దా అని ప్రశ్నించారు. వీరిందరికీ గుండు గీయడానికి కేఏ పాల్ కాపు ఉండగా.. వీళ్లు ఇంకో పార్టీ ఎందుకు పెట్టారని మండిపడ్డారు. అంతేగాక రాజకీయాల్లో సిగ్గులేని కాపులు చాలా మంది ఉన్నారని, అప్పుడు చిరంజీవికి సిగ్గు లేక కాంగ్రెస్ పార్టీకి ప్యాకేజీ స్టార్ అయ్యాడని, ఈరోజు పవన్ కళ్యాణ్ బీజేపీ, టీడీపీ లకి బానిసయ్యాడని హాట్ కామెంట్స్ చేశారు. అలాగే సిగ్గులేని వాళ్లు మాత్రమే " డిప్యూటీ సీఎం గారి తాలూకా " అని బోర్డు పెట్టుకుంటారని, సిగ్గు ఉన్న ప్రతీ ఒక్కరు ఛీ పవన్ కళ్యాణ్, పదవీ కోసం మోడీ కాళ్ల మీద పడతావా.. కేఏ పాల్ తో జాయిన్ అవ్వు అని చెప్పాలని పాల్ పిలుపునిచ్చారు.