- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జగన్ రెడ్డి మరో రాజకీయ కుట్రే ఫైబర్ నెట్ స్కాం: అచ్చెన్నాయుడు
దిశ, డైనమిక్ బ్యూరో : ఏపీ ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టులో ఒక్క రూపాయి కూడా అవినీతి జరగలేదు అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తెలిపారు. రాజకీయ కక్షతోనే వైసీపీ తప్పుడు ఆరోపణలు చేస్తోందని ఆరోపించారు. ఆదివారం ‘ఫైబర్ నెట్ పై ఖర్చు రూ. 280 కోట్లు.. ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం రూ. 900 కోట్లు నిజం అవినీతి అబద్దం’ పేరుతో పుస్తకం విడుదల చేశారు. ఈ సందర్బంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతూ....ఫైబర్ నెట్ పై వైసీపీ ఆరోపణలు సిగ్గుమాలిన చర్యగా అభివర్ణించారు. ప్రజలకు మేలు చేసిన ప్రాజెక్టుపై నిందలు వేయడం రాజకీయ కుట్ర కాదా? అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రజలకు నెలకు రూ.149కే ఇంటికి ఇంటర్నెట్, ఫోన్, టీవీ ఛానళ్ల సౌకర్యం కల్పించాం. ఏపీ ఫైబర్ నెట్ విధానాన్ని అనుసరించాలని ఇతర రాష్ట్రాలకు సైతం కేంద్రం సూచించింది అని చెప్పుకొచ్చారు. పైబర్ గ్రిడ్ పై చేసిన ఖర్చు ఆధారాలతో సహా కళ్ల ముందే కనపడుతుంటే వైసీపీ నేతలు సిగ్గులేకుండా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు అని మండిపడ్డారు. ఇది జగన్ రెడ్డి ముఠా చేసే రాజకీయ కుట్ర కాక మరేమిటి? అని విరుచుకుపడ్డారు. చంద్రబాబు నాయుడు సభలకు వస్తున్న ప్రజాస్పందన చూసి జగన్ ఓటమి భయం పట్టుకుంది అని చెప్పుకొచ్చారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలిస్తే తనకు శ్రీలంకలో జరిగిన పరిస్ధితి తప్పదని భావించే చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేశారన్నారు. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసి ఇన్ని రోజులైనా పైసా కూడా అవినీతి జరిగినట్లు నిరూపించలేకపోయారు అని చెప్పుకొచ్చారు. టీడీపీ ప్రభుత్వంలో ఎలాంటి అవినీతి జరగలేదు. ఆ విషయం జగన్ తోపాటు అందరికీ తెలుసునన్నారు. నాలుగున్నరేళ్ల పాలనలో జగన్ అన్ని రంగాలను భ్రష్టుపట్టించారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అభివృద్ది లేదు, పరిశ్రమలు పెట్టుబడులు రావటం లేదు, యువతకు ఉపాధి లేక నిరుద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సాగునీటి ప్రాజెక్టుల్ని గాలికొదిలి. వైసీపీ పాలనలో అన్ని వర్గాలు నష్టపోయాయని అచ్చెన్నాయుడు ఆరోపించారు.