జగన్ ఒక రావణాసురుడు : మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు

by samatah |   ( Updated:2023-05-01 07:16:22.0  )
జగన్ ఒక రావణాసురుడు : మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు
X

దిశ, ఉత్తరాంధ్ర : జగన్ ఒక రావణాసురుడు అని మాజీ మంత్రి ఉత్తర నియోజకవర్గం శాసనసభ్యులు గంట శ్రీనివాసరావు ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతు నాలుగేళ్ళ క్రితమే భోగాపురం ఎయిర్ పోర్ట్, ఆదాని డేటా సెంటర్ లకు చంద్రబాబు శంఖు స్థాపన చేశారు ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయని వాటినే మళ్ళీ ఈ సీఎం జగన్ భూమి పూజ చెయ్యడం ఏంటి అని ప్రశ్నించారు విశాఖలో హెచ్ ఎస్ బి సి వైజాగ్ వదిలి వెళ్లిపోయింది ఎప్పుడైనా సీఎం జగన్ వెళ్లిపోతున్న కంపెనీ లతో మాట్లాడారా అని అన్నారు న్యాయస్థానాలలో 11548 ధిక్కార కేసులతో దేశం లో ఆంధ్ర ప్రదేశ్ లో మొదటి స్థానం లో ఉందని అన్నారు. కేంద్ర న్యాయ శాఖ మంత్రె స్వయంగా వివరాలను వెల్లడించారన్నారు. న్యాయస్థానాలు అంటే ఈ వైసిపి ప్రభుత్వానికి గౌరవం లేదు అన్నారు. విశాఖ మెట్రో రైల్ అట్టకెక్కింది విశాఖ నుంచి పరిశ్రమలు వెళ్లిపోతున్నాయి అన్నారు.

విశాఖ లో గతంలో చాలా విమాన సర్వీసులు ఉండేవి జగన్ రెడ్డి పుణ్యమా అని ఇప్పుడు ఒకటి రెండు సర్వీసులు మిగిలాయి రొయ్యలు ఎగుమతి చేసుకోవడానికి రైతులు సిద్ధమైతే విమానం లేకుండా చేశారు అని అన్నారు. గతం లో ఐటీ హిల్స్ లో మంచి మౌలిక సదుపాయాలు కల్పిస్తే వాటిని నిర్వీర్యం చేశారు అని చెప్పారు. ఒకటో తారీఖు జీతం ఇవ్వలేరు కాని పెద్ద ఎత్తున్న పరిశ్రమలు తెస్తానని ప్రగల్భాలు పలుకుతున్నారణి ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రజలకు అవినాష్ రెడ్డి అరెస్ట్ పై దృష్టి పక్కదారి పెట్టేందుకే విశాఖ పర్యటన చేస్తున్నారు అని అన్నారు. నాలుగేళ్ళలో ఒక్క అభివృద్ధి కార్యక్రమం జరగలేదు కేవలం బటన్ నొక్కడమే అభివృద్ధి అనుకుంటున్నారా జగగనన్న మా నమ్మకం అని ప్రచారం చేసుకుంటున్నారు

జగన్ ఎందుకు నిన్ను నమ్మాలి అని ప్రశ్నించారు. ఎన్నికల ఏడాదిలో హడావిడీ చేస్తే గెలుస్తామనుకోవడం మీ భ్రమ ప్రజలు నమ్మి ఒక్క ఛాన్స్ ఇచ్చిన తర్వాత నాలుగేళ్లలో ఏమి చేశారో చెప్పాలి కేంద్రం మెడలు ఎలా వంచుతామన్నారు. ఢిల్లీ పెద్దల వద్ద ఎలా సాగిలపడ్డారో చూశాము భోగాపురం ఎయిర్ పోర్టుకు స్ధల సేకరణ టిడిపి హయాంలో 90శాతం భూసేకరణ జరిపాము అన్నారు. పరిశ్రమలు తరలిపోకుండా సంబంధిత సిఈఓలతో ఒక్క సారైనా రివ్యూ చేశారాఎకో సిస్టమ్ లేకుండా చేశారు గ్రీన్ ఎనర్జీతో ముందుకు వెళ్లాలని చూశాము.దానికి కూడా అడ్డుపడ్డారు అని పేర్కొన్నారు. విశాఖ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ ఉత్తరాంధ్ర ద్రోహి గా జగన్ నిలిచిపోతారని అన్నారు విశాఖలోనే రూ. 43 వేల కోట్ల భూములను కాజేశారు అని ఆరోపించారు. అదానీకి రూ 130 కోట్లకు గతంలో కన్నా విలువైన భూములను కట్టబెట్టారు అని ఆరోపించారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి గా వుండి అబద్దాలు చెప్పడం ఏంటి అని ప్రశ్నించారు. నాణ్యత లేని మద్యం తో ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నార నీ అన్నారు. ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు మాట్లాడుతూ పది లక్షల కోట్లు అప్పుల భారాన్ని రాష్ట్రం పై పెట్టారు అని అన్నారు రైతులకు గిట్టుబాటు ధరలు లేవు ఏపిలోప్రతి రైతుపైనా 2.50 లక్షల అప్పు వుందని అన్నారు. కౌలు రైతుల ఆత్మహత్యల్లో ఏపి ముందుంది అని చెప్పారు. ఆక్వారంగం కుదేలైంది అని అన్నారు సమావేశంలో విశాఖ తూర్పు శాసనసభ్యులు వెలగపూడి రామకృష్ణ బాబు విశాఖ దక్షిణ నియోజకవర్గ ఇన్చార్జ్ గండి బాబ్జి విశాఖ పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి పాశర్ల ప్రసాద్,ఉత్తర నియోజకవర్గం చిక్కాల విజయబాబు, 98 వార్డు కార్పొరేటర్ పి వీ నరసింహ, విశాఖ పార్లమెంట్ అధికార ప్రతినిధి ఆళ్ల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

Read More: రాజధాని లేని రాష్ట్రంగా మార్చిన అపకీర్తి జగన్‌దే : కే రామకృష్ణ

Advertisement

Next Story

Most Viewed