Indrakeeladri: దసరా నవరాత్రులకు ముస్తాబవుతోన్న ఇంద్రకీలాద్రి.. ఉత్సవాల షెడ్యూల్ ఇదే..!

by Maddikunta Saikiran |
Indrakeeladri: దసరా నవరాత్రులకు ముస్తాబవుతోన్న ఇంద్రకీలాద్రి.. ఉత్సవాల షెడ్యూల్ ఇదే..!
X

దిశ, వెబ్‌డెస్క్:విజయవాడ(Vijayawada)లోని ఇంద్రకీలాద్రి(Indrakeeladri)పై ప్రతి ఏడాది దసరా(Dussehra) నవరాత్రులు ఘనంగా జరుగుతాయన్న విషయం తెలిసిందే. దసరా వచ్చిందంటే చాలు లక్షలాది మంది భక్తులు దుర్గమ్మను దర్శించుకుంటారు.దీంతో ఈ ఏడాది జరిగే నవరాత్రుల కోసం ఇంద్రకీలాద్రిపై సామాన్య భక్తులకు ఆలయ అధికారులు ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తున్నారు . సర్వ దర్శనం నుంచి ప్రత్యేక దర్శనం వరకు ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేస్తున్నారు. కాగా ఈ ఏడాది ఇంద్రకీలాద్రిపై దసరా నవరాత్రుల ఉత్సవాలను అక్టోబర్ 3 నుంచి 12 వరకు నిర్వహిస్తామని ఆలయ అధికారులు తెలిపారు. దీంతో ఉత్సవాల ఏర్పాట్లపై విజయవాడ కలెక్టర్ సృజన(Collector Srujana) బుధవారం సంబంధిత శాఖల అధికారులతో సమావేశమయ్యారు.మూలా నక్షత్రం రోజు అనగా అక్టోబర్ 9న సీఎం చంద్రబాబు(CM Chandrababu) రాష్ట్ర ప్రభుత్వం తరుపున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారని, అందుకోసం తగిన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ దేవాదాయ శాఖ అధికారులను ఆదేశించారు.

ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు ఈ రూపాల్లో భక్తులకు దర్శనం..

  • అక్టోబర్ 3 - బాలా త్రిపుర సుందరీదేవి
  • అక్టోబర్ 4 - గాయత్రీ దేవి
  • అక్టోబర్ 5 - అన్నపూర్ణ దేవి
  • అక్టోబర్ 6 - లలితా త్రిపుర సుందరీదేవి
  • అక్టోబర్ 7 - మహాచండీ దేవి
  • అక్టోబర్ 8 - మహాలక్ష్మీ దేవి
  • అక్టోబర్ 9 - సరస్వతి దేవి
  • అక్టోబర్ 10- దుర్గాదేవి
  • అక్టోబర్ 11- మహిషాసురమర్దిని
  • అక్టోబర్ 12- రాజరాజేశ్వరీ దేవి
Advertisement

Next Story

Most Viewed