"హర్ ఘర్ తిరంగా" కార్యక్రమంలో భాగంగా భారీ జాతీయ జెండా ర్యాలీ

by Jakkula Mamatha |
హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా భారీ జాతీయ జెండా ర్యాలీ
X

దిశ ప్రతినిధి,నంద్యాల సిటీ:నంద్యాల పట్టణంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న హర్ ఘర్ తీరంగ ప్రతి ఇంటికి జాతీయ జెండా చేరాలని ముఖ్య ఉద్దేశంతో నిర్వహించే ఈ కార్యక్రమంలో నంద్యాలలో స్థానిక టెక్క మార్కెట్ యార్డ్ నుంచి గాంధీ చౌక్ వరకు భారీ జాతీయ జెండా ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రివర్యులు ఎన్.ఎం.డి ఫరూక్ జాతీయ జెండా ర్యాలీని ప్రారంభించిన ప్రతి ఒక్కరు దేశం కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయుల జీవిత గాథలను గుర్తు చేసుకుని దేశ అభివృద్ధికి పునః అంకితమివ్వాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి ఐఏఎస్ , జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్ తెలుగుదేశం పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్.ఎం.డి ఫిరోజ్, డీఆర్ఓ పద్మజ, జిల్లాధికారులు వందలాది విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed