తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ..సర్వ దర్శనానికి ఎన్ని గంటల సమయం పడుతుందంటే?

by Jakkula Mamatha |   ( Updated:2024-08-29 08:33:33.0  )
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ..సర్వ దర్శనానికి ఎన్ని గంటల సమయం పడుతుందంటే?
X

దిశ,వెబ్‌డెస్క్: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవడానికి దేశం నలుమూలల నుంచి నిత్యం వేలాది మంది వస్తుంటారు. ఈ క్రమంలో శ్రీ వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారు. ఈ నేపథ్యంలో తిరుమలలో భక్తుల రద్ధీ కొనసాగుతుంటుంది. నిన్న (బుధవారం) రోజున కూడా భక్తుల రద్దీ ఎక్కువగానే ఉంది. కాగా నిన్న తిరుమల శ్రీవారిని 76,772 మంది భక్తులు దర్శించుకున్నారు. 30,293 మంది భక్తులు శ్రీవారికి తలనీలాలు సమర్పించారు.

అయితే నేడు(గురువారం) శ్రీవారి దర్శనానికి భక్తుల రద్దీ కొనసాగుతున్న క్రమంలో ఉచిత సర్వదర్శనానికి అయితే సుమారు 18 గంటల సమయం, ప్రత్యేక దర్శనం టికెట్లు కలిగిన భక్తులకు 4 గంటల్లో దర్శనం లభిస్తోంది. ఉచిత సర్వదర్శనానికి 19 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తులు బుధవారం అర్ధరాత్రి వరకు 65,131 మంది స్వామివారిని దర్శించుకున్నారు. వీరిలో 30,998 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. కానుకల రూపంలో హుండీలో రూ.4.66 కోట్లు సమర్పించారు. టైమ్ స్లాట్(ఎస్‌ఎస్‌డీ)దర్శనానికి పది కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్న భక్తులకు 5 గంటల సమయం పడుతుందని ఆలయ అధికారులు సూచించారు.

Advertisement

Next Story

Most Viewed