Tirumala News:తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉందంటే..?

by Jakkula Mamatha |
Tirumala News:తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉందంటే..?
X

దిశ,వెబ్‌డెస్క్:తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవడానికి నిత్యం ఎంతో మంది భక్తులు వస్తుంటారు. ఈ క్రమంలో తిరుమల(Tirumala)లో భక్తుల రద్దీ నెలకొంటుంది. ఈ నేపథ్యంలో నేడు(ఆదివారం) తిరుమల(Tirumala)వెంకన్నను దర్శించుకునేందుకు వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 20 కంపార్టుమెంట్ల(compartments)లో భక్తులు వేచి ఉన్నారు. తిరుమల(Tirumala)లో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. టోకెన్ రహిత సర్వదర్శనం కోసం 20 కంపార్ట్‌మెంట్లలో భక్తులు(devotees) వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. శనివారం స్వామి వారిని 83,960 మంది భక్తులు దర్శించుకోగా.. 32,342 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి హుండీకి రూ.296 కోట్లు ఆదాయం వచ్చినట్లు టీటీడీ వెల్లడించింది.

Advertisement

Next Story

Most Viewed