- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఈనెల 9లోపు చంద్రబాబు బయటకు వస్తారని ఆశిస్తున్నా: అచ్చెన్నాయుడు
దిశ , డైనమిక్ బ్యూరో : ఏపీ ఫైబర్ గ్రిడ్ కేసులో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‍కు సంబంధం లేదని రాష్ట్ర ప్రభుత్వమే క్లీన్ చిట్ ఇచ్చింది అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. ఏపీ ఫైబర్ గ్రిడ్ కేసులో లోకేశ్ లంచ్ మోషన్ పిటిషన్‌పై న్యాయస్థానంలో ప్రభుత్వ వాదనలతో కేసు డొల్లతనం బహిర్గతమైంది అని అన్నారు. ప్రభుత్వం కక్షసాధింపు కోసం అక్రమ కేసులు పెడుతోందన్నది స్పష్టమైంది అని అచ్చెన్నాయుడు ఆరోపించారు. ఎన్నికల వరకూ చంద్రబాబు జైల్లో ఉండాలని జగన్ తాపత్రయం అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. హడావుడిగా రేపు జగన్ ఢిల్లీ వెళ్తున్నారు అని అచ్చెన్నాయుడు విమర్శించారు. ఈనెల 9 లోపు చంద్రబాబు బయటకు వస్తారని యోచిస్తున్నట్లు అచ్చెన్నాయుడు తెలిపారు. బాబుతో నేను, రిలే నిరాహారదీక్షలు ఈనెల 9 వరకూ కొనసాగుతాయి అని ప్రకటించారు. 10 నుంచి వివిధ రూపాల్లో నిరసనలకు కొత్త కార్యక్రమం చేపడతాం అని వెల్లడించారు. కోర్టు పరిణామాలు చూసి ప్రజల్లోకి వెళ్లే కార్యక్రమాలను నిర్ణయిస్తాం అని అచ్చెన్నాయుడు తెలిపారు. జనసేనతో సమన్వయం కోసం ఐదుగురు సభ్యుల కమిటీని త్వరలో ప్రకటిస్తాం అని తెలిపారు. ప్రస్తుతానికి జనసేనతో మాత్రమే పొత్తులో ఉన్నాం.. వామపక్ష పార్టీలతో పొత్తు అంశం చంద్రబాబు నిర్ణయిస్తారు అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తెలిపారు.