- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
విశాఖ ఉక్కు విక్రయాలపై హైకోర్టు స్టేటస్ కో
దిశ ప్రతినిధి, విశాఖపట్నం: సంవత్సరాలుగా పోరాటం చేస్తున్న విశాఖ ఉక్కు ఉద్యోగులకు, కార్మికులకు శుభవార్త లభించింది. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ, యూనిట్ల అమ్మకంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు స్టేటస్ కో ఉత్తర్వుల జారీ చేసింది. జై భారత్ పార్టీ అధినేత వి . వి లక్ష్మీనారాయణ, ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కే ఏ పాల్ దీనిపై హై కోర్టును ఆశ్రయించారు. దీనిపై గురువారం విచారణ జరిపిన హైకోర్టు విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో స్టేటస్ కో ఇచ్చింది. 2024 జూన్‌లో కోర్టు తిరిగి తెరిచే వరకు స్టీల్ ప్లాంట్‌ను విక్రయించడం లేదని అదనపు సొలిసిటర్ జనరల్ కోర్టుకు తెలియజేశారు.
ఈ రోజు యథాతథ స్థితిని పాటించాలని యూనియన్ ఆఫ్ ఇండియాను కోర్టు ఆదేశిస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు 19-6-2024కి వాయిదా వేసింది. విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేయనివ్వనంటూ ఆధారాలతో ఇప్పటికే హైకోర్టులో జేడి లక్ష్మీనారాయణ పిల్ వేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు హైకోర్టు ఇచ్చిన స్టేటస్ కో జేడీ లక్ష్మీనారాయణ రాజకీయ తొలివిజయంగా అభిమానులు భావిస్తున్నారు.