- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఏపీ మంత్రికి హైకోర్టు నోటీసులు
X
దిశ, వెబ్ డెస్క్: మంత్రి విడదల రజినికి ఏపీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. గ్రానైట్ తవ్వకాలకు ఎన్ వోసీ జారీ అంశంలో ఈ నోటీసులను జారీ చేసినట్లు సమాచారం. ఇదే అంశంలో కడప ఎంపీ అవినాశ్ రెడ్డి మామ ప్రతాప్ రెడ్డికి కూడా హైకోర్టు నోటీసులు ఇచ్చింది. ఎన్టీఆర్ జిల్లా మొరకపూడిలో 91 ఎకరాల అసైన్డ్ భూమిలో తవ్వకాలకు సంబంధించి అనుమతి విషయంలో మంత్రి రజిని హస్తం ఉందంటూ ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు కాగా విచారించిన హైకోర్టు ఈ మేరకు నోటీసులు జారీ చేసింది. వివరణ ఇవ్వాలని విడదల రజినితో పాటు స్థానిక తహసీల్దార్ కు నోటీసులు జారీ చేసింది. నోటీసులు జారీ కావడంతో ఈ అంశం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. తదుపరి విచారణను కోర్టు 3వారాల పాటు వాయిదా వేసింది.
Also Read...
పరవాడ ఫార్మాసిటీ ప్రమాదంపై మంత్రి దిగ్భ్రాంతి.. మృతుల కుటుంబాలకు పరిహారం
Advertisement
Next Story