ఏపీలో రంగుల రాజకీయంపై కోర్టులో విచారణ

by karthikeya |
ఏపీలో రంగుల రాజకీయంపై కోర్టులో విచారణ
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ కార్యాలయాలు, అన్నా క్యాంటీన్లపై టీడీపీ రంగులు వెయ్యటాన్ని సవాల్ చేస్తూ ఏపీ హైకోర్టు పిటిషన్‌ దాఖలైన విషయం తెలిసిందే. దీనిపై పిటిషన్‌పై బుధవారం ఏపీ హైకోర్టు విచారణ జరిపింది. ఈ సందర్భంగా పిటిషనర్ తరపు న్యాయవాది.. గతంలో గ్రామ సచివాలయలకు బ్లూ కలర్ వేయటాన్ని తప్పుబడుతూ కోర్టు తీర్పు ఇచ్చిందని ధర్మాసనానికి గుర్తు చేశారు. బ్లూ కలర్ తొలగించాలని కోర్టు ఆదేశాలు ఇవ్వగా.. రంగులు తొలగించడం ఆలస్యం కావడంతో కోర్టు ధిక్కరణ పిటిషన్ కూడా దాఖలైందని న్యాయస్థానం దృష్టికి తీసుకువచ్చారు.

దీనిపై రంగును బట్టి పార్టీని ఎలా డిసైడ్‌ చేస్తారంటూ సదరు పిటిషన్‌ను హైకోర్టు ప్రశ్నించింది. అలాగే అన్నా క్యాంటీన్లకు ఇంతకు ముందు ఏ కలర్ వేశారని అడిగింది. చివరిగా ఈ కేసులో ప్రతివాదులకు కూడా నోటీసులు జారీ చేసి.. తదుపరి విచారణ 6 వారాలకు వాయిదా వేసింది.

Advertisement

Next Story

Most Viewed