Breaking: తిరుమలలో హెలికాప్టర్ చక్కర్లు.. టీటీడీ అలర్ట్

by srinivas |
Breaking: తిరుమలలో హెలికాప్టర్ చక్కర్లు.. టీటీడీ అలర్ట్
X

దిశ, వెబ్ డెస్క్: తిరుమల(Tirumala)లో హెలికాప్టర్(Helicopter) చక్కర్లు కొట్టడం కలకలం రేగింది. తిరుమల కొండపై ఆకాశంలో ఎలాంటి విమానాలు, హెలికాప్టర్లు, డ్రోన్లు ఎగరకూడదనే నిబంధన ఉంది. శ్రీవారి ఆలయం(Srivari Temple) పరిసర ప్రాంతాను నో ఫ్లై జోన్‌(No fly zone)గా ప్రకటించారు. అయినా సరే ఇవాళ ఉదయం తిరుమల ఆకాశ వీధిలో హెలికాప్టర్ కనిపించింది. దీంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆగమశాస్త్రానికి విరుద్ధమంటూ మండిపడుతున్నారు.

అయితే ఈ హెలికాప్టర్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్లిందనేదానిపై టీటీడీ అధికారులు(TTD officials) ఆరా తీస్తున్నారు. నో ఫ్లై జోన్‌గా ఉన్నా తిరుమల కొండపై ఆకాశంలో హెలికాప్టర్ వెళ్లడంపై ఏవీయేషన్ అధికారులకు సమాచారం అందించారు. ఆగమశాస్ర్తాన్ని ఉల్లంఘించడంపైనా అధికారులతో మాట్లాడుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed