ముంబయి నటికి వేధింపుల కేసు.. ఉన్నతస్థాయి దర్యాప్తుకు ప్రభుత్వం ఆదేశాలు

by M.Rajitha |
ముంబయి నటికి వేధింపుల కేసు.. ఉన్నతస్థాయి దర్యాప్తుకు ప్రభుత్వం ఆదేశాలు
X

దిశ, వెబ్ డెస్క్ : ఏపీలో సంచలనం రేపిన ముంబయి నటికి వేధింపుల కేసు మీద ఏపీ ప్రభుత్వం సీరియస్ అయింది. ఈ కేసులో వస్తున్న తీవ్ర విమర్శల నేపథ్యంలో ప్రభుత్వం ఉన్నతస్థాయి దర్యాప్తుకు ఆదేశాలు జారీ చేసింది. నటి కాదంబరి జత్వాని నుండి వెంటనే ఆన్లైన్ ఫిర్యాదు తీసుకొని ఎఫ్ఐఆర్ నమోదు చేసి కేసును లోతుగా దర్యాప్తు చేయాలని పోలీసులకు ఆదేశాలు అందినట్టు సమాచారం. దర్యాప్తులో భాగంగా విజయవాడ పోలీసులు ముంబయిలో నివాసం ఉంటున్న కాదంబరి నివాసానికి వెళ్లనున్నట్లు తెలుస్తోంది.

గత వైసీపీ ప్రభుత్వ హయాంలో తనను, తన కుటుంబాన్ని అక్రమ కేసుల్లో ఇరికించారని కాదంబరి ఓ టీవి ఛానెల్ ఇంటర్వ్యూలో మాట్లాడారు. తన ఇంటిని, బ్యాంక్ ఖాతాలు సీజ్ చేసి.. తనను రోడ్డున పడేశారు అని కన్నీటి పర్యంతం అయింది. వైసీపీ హాయంలోని ఆ పార్టీ నాయకుడు కుక్కల విద్యాసాగర్ తో పోలీసులు కుమ్మక్కయ్యి.. ఓ భయానక కుట్రలో తనను, తన కుటుంబాన్ని ఇరికించారని తెలిపారు. వీరందరి మీద కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు నాయుడు, హోంమంత్రి, ఏపీ ప్రభుత్వం తనకు న్యాయం చేయాలని మీడియా ద్వారా కాదంబరి విన్నవించారు. తాజాగా ఈ కేసుపై స్పందించిన ఏపీ ప్రభుత్వం ఈ కేసులో ప్రత్యేక దర్యాప్తు చేయాలని, బాదితురాలికి న్యాయం చేయాలని పోలీసులకు ఆర్డర్స్ జారీ చేసింది.

Next Story

Most Viewed