Pawan Kalyan:‘అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు’.. దయచేసి వాటి జోలికి వెళ్లకండి డిప్యూటీ సీఎం పవన్ పిలుపు

by Jakkula Mamatha |   ( Updated:2024-09-07 04:05:46.0  )
Pawan Kalyan:‘అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు’.. దయచేసి వాటి జోలికి వెళ్లకండి డిప్యూటీ సీఎం పవన్ పిలుపు
X

దిశ,వెబ్‌డెస్క్:నేడు వినాయక చవితి సందర్భంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఆసక్తికర ట్వీట్ చేశారు. తెలుగు రాష్ట్రాల అభివృద్ధి, ప్రజల సౌభాగ్యం అవిఘ్నంగా కొనసాగాలని విఘ్నాలకు అధిపతి అయిన గణేషుడిని మనసారా వేడుకుంటూ సకల జనులకు వినాయక చవితి శుభాకాంక్షలు(Happy Vinayaka Chavithi) తెలిపారు. ఏపీ ప్రజలు వరదలతో భీతిల్లుతున్న తరుణంలో వచ్చిన ఈ వినాయక చవితిని భక్తిప్రపత్తులతో ఆనందదాయకంగా జరుపుకునే పరిస్థితులు లేకపోవడం దురదృష్టకరం అని పవన్ కళ్యాణ్ విచారం వ్యక్తం చేశారు.

గణేష్ మండపాలు ఆడంబరంగా, ఆర్భాటాలకు పోకుండా సంప్రదాయబద్ధంగా పరిమితంగా చేసుకుని, ఆ విధంగా మిగిలిన నిధులను వరద బాధితులను(Flood victims) ఆదుకోవడానికి వినియోగించాలని డిప్యూటీ సీఎం పవన్(Deputy CM Pawan) కోరారు. మట్టి వినాయక ప్రతిమలనే పూజించండి అని ఎప్పట్లాగే ఇప్పుడూ చెబుతున్నానని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. నీటిలో కరగని కృత్రిమ పదార్థాలతో రూపొందించిన ప్రతిమలను ప్రోత్సహించవద్దని పిలుపునిచ్చారు. మన భావితరాలకు చక్కని పర్యావరణాన్ని అందించాలన్న సంకల్పాన్ని విస్మరించవద్దని సూచించారు. వరదలు, కరువు కాటకాలు లేని భవిష్యత్తును ప్రసాదించమని "నమామి తమ్ వినాయకం" అని ప్రార్థిస్తూ జనులందరికీ శుభాలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్టు పవన్ కళ్యాణ్ వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed