మోడీ రాజకీయ ప్రస్థానం ఒక అద్భుతం: పవన్​

by srinivas |
మోడీ రాజకీయ ప్రస్థానం ఒక అద్భుతం: పవన్​
X

దిశ, డైనమిక్​బ్యూరో: అతి సామాన్యమైన కుటుంబంలో జన్మించి, సామాన్య కార్యకర్తగా రాజకీయ ప్రయాణం ప్రారంభించి అసమాన్యమైన భారత ప్రధానిగా పదవీబాధ్యతలు నిర్వర్తించిన నరేంద్ర మోడీ రాజకీయ ప్రస్థానం ఓ అద్భుతమని ఉప ముఖ్యమంత్రి పవన్​ కల్యాణ్​ పేర్కొన్నారు. ఈ మేరకు ట్విట్టర్‌లో ఆయన మోడీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. భారతదేశ శక్తిసామర్ధ్యాలకు, భారతీయతలోని గొప్పదనానికీ అంతర్జాతీయ యవనికపై మరింత ప్రాచుర్యం కలిగించిన వారిలో మోడీ అగ్రగణ్యులని కొనియాడారు.

భారతదేశాన్ని ప్రపంచంలో ప్రభల ఆర్ధిక శక్తిగా రూపొందించే సంకల్పంతో ఆయన వడివడిగా వేస్తున్న అడుగులు బహు ప్రశంసనీయం అన్నారు. వరుసగా పుష్కర కాలానికిపైగా గుజరాత్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా, వరుసగా మరో మూడు పర్యాయాలు అఖండ భారతావనికి ప్రధానిగా పదవీ బాధ్యతలు నిర్వర్తించడం 'న భూతో న భవిష్యతి'. అటువంటి గొప్ప రాజకీయ మానవతావాది నాయకత్వంలోని ఎన్.డి.ఎ.లో తాను సైతం భాగస్వామిని కావడం అదృష్టంగా భావిస్తున్నానని పవన్ ట్వీట్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed