- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
AP ఉద్యోగులకు ప్రభుత్వం షాక్ .. వారం రోజులే డెడ్‌లైన్
గవర్నర్‌ను ఎందుకు కలిశారో వివరణ ఇవ్వండి
ఏపీ ప్రభుత్వ ఉద్యోగ సంఘానికి సర్కార్ నోటీసులు
మీ సంఘం గుర్తింపు ఎందుకు రద్దు చేయకూడదో చెప్పాలని ఆదేశాలు
దిశ, డైనమిక్ బ్యూరో: ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ప్రతినిధులు గవర్నర్ బీబీ హరిచందన్‌ను కలిసి ప్రభుత్వానికి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. కోట్లాది రూపాయల బకాయిలు తక్షణమే చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఒకటో తారీఖునే వేతనాలు అందేలా.. పెన్షనర్లకు పెన్షన్ వచ్చేలా చర్యలు తీసుకోవాలని, తమ న్యాయమైన డిమాండ్లను నెవరేర్చాలని విజ్ఞప్తి చేశఆరు.
అయితే గవర్నర్ కలవడంపై ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘంను వివరణ కోరుతూ నోటీసులు జారీ చేసింది. జీతాలు, ఆర్థిక అంశాలపై ప్రభుత్వంతో చర్చిచేందుకు ప్రత్యామ్నాయ మార్గాలు ఉండగా నేరుగా గవర్నర్‌ను ఎందుకు కలిశారో చెప్పాలని నోటీసుల్లో పేర్కొంది. మీడియా, పత్రికల్లో వచ్చిన కథనాల ఆధారంగానే నోటీసులు ఇస్తున్నామని వెల్లడించింది. ప్రభుత్వ ఉద్యోగులు గవర్నర్‌కు కలిసి ఫిర్యాదు చేయడం రోసా నిబంధనలకు విరుద్ధం కాదా అని ప్రశ్నించింది ప్రభుత్వం. ఈ పరిణామాల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం గుర్తింపును ఎందుకు రద్దు చేయకూడదో చెప్పాలని నోటీసుల్లో స్పష్టం చేసింది. అందుకు వారం రోజులు గడువు ఇచ్చింది.
కాగా నెల నెలా జీతాలు ఆలస్యంకావడం..ఉద్యోగులు దాచుకున్న సొమ్ములు జీపీఎఫ్, ఏపీ జీఎల్ఐ వంటి ఖాతాల నుంచి కుటుంబ అవసరాలకు సొమ్మును విత్ డ్రా చేసుకునే అవకాశాన్ని సైతం ప్రభుత్వం కల్పించకపోవడంపై గవర్నర్‌కు ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఫిర్యాదు చేసింది. పీఆర్సీ అమలు అనంతరం సుమారు నాలుగు డీఏలు పెండింగ్‌లో ఉన్నాయని.. దాదాపు పన్నెండు వేల కోట్ల రూపాయలు ఉద్యోగులకు వివిధ రూపాల్లో ప్రభుత్వం బకాయిపడిందని, వాటిని కూడా ప్రభుత్వం చెల్లించేందుకు ముందుకు రావడం లేదని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కేఆర్ సూర్యనారాయణ నేతృత్వంలోని సభ్యులు ఫిర్యాదు చేశారు. భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 309 అధికరణ ప్రకారం ప్రభుత్వ ఉద్యోగుల సర్వీసు వ్యవహారాల నియంత్రణ విషయంలో ప్రత్యక్ష సంబంధ అధికారాలు గల గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ను రాజభవన్‌లో ఉద్యోగ సంఘాల ప్రతినిధులు కలిశారు. తక్షణమే ఉద్యోగుల ఆర్ధిక ప్రయోజనాల బకాయిల విడుదలకు ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ వినతిపత్రాన్ని సమర్పించిన సంగతి తెలిసిందే. అంతేకాదు ప్రభుత్వం తమ డిమాండ్లను నెరవేర్చకపోతే ఏప్రిల్ నెల నుంచి తమ సంఘం ఆధ్వర్యంలో ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు, పెండింగ్ బకాయిలపై పెద్ద ఎత్తున ఉద్యమించాలని ఈనిర్ణయించినట్లు కేఆర్ సూర్యనారాయణ ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఇవి కూడా చదవండి : యువగళం కాదు టీడీపీకి మంగళం : రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి R K Roja