Ap High Court: విధులు బహిష్కరించిన న్యాయవాదులు

by srinivas |   ( Updated:2022-11-25 15:03:56.0  )
Ap High Court: విధులు బహిష్కరించిన న్యాయవాదులు
X

దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్ర హైకోర్టుకు చెందిన న్యాయమూర్తుల బదిలీలపై న్యాయవాదులు ఆగ్రహం వ్యక్తం చేశారు. హైకోర్టుకు చెందిన న్యాయమూర్తుల బదిలీలను నిరసిస్తూ న్యాయవాదులు విధులు బహిష్కరించి నిరసన తెలిపారు. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ బట్టు దేవానంద్‌, జస్టిస్‌ డి. రమేశ్‌ బదిలీ సరికాదన్నారు. న్యాయమూర్తుల బదిలీ ప్రతిపాదన వివక్షకు సంకేతమని న్యాయవాదులు ఆరోపించారు.

కాగా ఏడుగురు హైకోర్టు న్యాయమూర్తుల బదిలీకి సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసిన సంగతి తెలిసిందే. దీంతో జస్టిస్ వీఎం వేలుమణి, జస్టిస్ బట్టు దేవానంద్, జస్టిస్ డి.రమేష్, జస్టిస్ లలిత కన్నెగంటి, జస్టిస్ డి.నాగార్జున, జస్టిస్ టి.రాజా, జస్టిస్ ఏ.అభిషేక్ రెడ్డి బదిలీ కానున్నారు. అయితే గుజరాత్ హైకోర్టుకు చెందిన జస్టిస్ నిఖిల్ ఎస్ కారియల్ పేరు జాబితాలో లేకపోవడం చర్చకు దారి తీసింది.

గతంలో జస్టిస్ కారియల్‌ను పాట్నా హైకోర్టుకు బదిలీ చేయాలని కొలీజియం ప్రతిపాదించింది. జస్టిస్ కారియల్‌ బదిలీకి వ్యతిరేకంగా గుజరాత్ హైకోర్టు బార్ అసోసియేషన్ నిరసనలు చేశారు. దీంతో వారి అభ్యంతరాలను తెలియజేయడానికి భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్‌ను కూడా కలిశారు. జస్టిస్ అభిషేక్ రెడ్డి రెడ్డి, జస్టిస్ రాజా పేర్లను కూడా నవంబర్ 17న జస్టిస్ కారియల్‌తో పాటు పరిశీలించారు. అయితే బదిలీల్లో కేవలం జస్టిస్ అభిషేక్ రెడ్డి రెడ్డి, జస్టిస్ రాజా పేర్లు ఉండటంతో తెలంగాణ, మద్రాసు బార్లు నిరసన తెలిపిన సంగతి తెలిసిందే.

READ MORE

సిట్ నోటీసులపై ఎంపీ రఘురామకృష్ణంరాజు రియాక్షన్ ఇదే..

Advertisement

Next Story