రాజధాని నిర్మాణాలపై ప్రభుత్వం సంచలన నిర్ణయం.. ఆ సంస్థలకు బాధ్యతలు

by srinivas |   ( Updated:2024-07-12 17:12:40.0  )
రాజధాని నిర్మాణాలపై ప్రభుత్వం సంచలన నిర్ణయం.. ఆ సంస్థలకు బాధ్యతలు
X

దిశ, వెబ్ డెస్క్: అమరావతిలో నిర్మాణాలపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. 2014-19 మధ్య సచివాలయ ఐకానిక్ టవర్లు, అసెంబ్లీ భవనాలు, ఏఐఎస్‌లు, ఎన్జీవోల సముదాయాలను నిర్మించారు. అయితే 2019 ఎన్నికల్లో జగన్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో రాజధాని నిర్మాణాలు ఆగిపోయిన విషయం తెలిసిందే. అయితే అమరావతిలో ప్రస్తుతమున్న నిర్మాణాల పటిష్టత ఏ విధంగా ఉందనే విషయంపై చంద్రబాబు ఫోకస్ పెట్టారు. సచివాలయ ఐకానిక్ టవర్లు, అసెంబ్లీ భవనాలు, ఏఐఎస్‌లు, ఎన్జీవోల సముదాయాల బేస్ మెంట్స్‌పై అధ్యయనం చేయాలని నిర్ణయించారు. కట్టడాల పటిష్టత నిర్ధారణకు ప్రయత్నం చేస్తున్నారు. ఈ బాధ్యతలను చెన్నై ఐఐటీకి అప్పగించేందుకు సిద్ధమయ్యారు. దీంతో చెన్నై, హైదరాబాద్ ఐఐటీ సంస్థలకు లేఖలు రాయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ సంస్థలు ఇచ్చే నివేదిక ఆధారంగా అడుగులు వేయాలని నిర్ణయించుకుంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Advertisement

Next Story

Most Viewed