ఏపీలో పరిశ్రమలకు గుడ్ న్యూస్.. బంపర్ ఆఫర్స్ ప్రకటించిన చంద్రబాబు

by srinivas |   ( Updated:2024-07-11 14:47:30.0  )
ఏపీలో పరిశ్రమలకు గుడ్ న్యూస్.. బంపర్ ఆఫర్స్ ప్రకటించిన చంద్రబాబు
X

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని, అన్ని విధాలుగా సాయం అందిస్తామని సీఐఐ ప్రతినిధులకు సీఎం చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. విశాఖపట్నంలో సీఐఐ ప్రతినిధులతో ఆయన వర్చువల్‌గా భేటీ అయ్యారు. రాష్ట్రంలోని వనరులు, అవకాశాలపై సీఐఐ ప్రతినిధులకు చంద్రబాబు వివరించారు. రాష్ట్రాన్ని పునర్నించే క్రమంలో పరిశ్రమలకు మెరుగైన రాయితీలు కల్పిస్తామని భరోసా ఇచ్చారు. ఆర్థిక సంస్కరణల తర్వాత పబ్లిక్, ప్రైవేట్ పీపుల్స్ పార్ట్‌నర్ షిప్ (పీ4) పాలసీని ప్రవేశపెట్టబోతున్నామని చంద్రబాబు చెప్పారు.

‘‘పీపుల్ అంటే కేపిటల్ అని, ఇతర అంశాలన్నీ కేపిటల్‌కు అదనం. ఆక్వా కల్చర్, హార్టికల్చర్ హబ్‌గా ఆంధ్రప్రదేశ్‌కి మంచి పేరుంది. ఫార్మా ప్రొడక్షన్, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాలతో వీటిని అనుసంధానం చేయాలి. వీటి కోసం కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయించి పలు కార్యక్రమాలు అమలు చేస్తోంది. సులభతర వ్యవసాయం అనేది నా విధానం. ఇతర పరిశ్రమలు, రంగాలతో పోలిస్తే వ్యవసాయ రంగం చాలా సంక్షోభాలను ఎదుర్కొంటోంది.’’ అని సీఐఐ ప్రతినిధులకు సీఎం చంద్రబాబు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed