కాంట్రాక్ట్ ఉద్యోగులకు గుడ్ న్యూస్... ఆ నిబంధనను తొలగించిన సీఎం జగన్

by Seetharam |   ( Updated:2023-08-16 11:38:08.0  )
ys jagan
X

దిశ, డైనమిక్ బ్యూరో : కాంట్రాక్ట్ ఉద్యోగులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గుడ్ న్యూస్ చెప్పారు. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన మాట ప్రకారం కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. 2014 జూన్ 2 నాటికి 5 సంవత్సరాలు పూర్తి చేసుకున్న కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని గత క్యాబినెట్ లో తీర్మానం చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ విషయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. 5సంవత్సరాల నిబంధన తొలగించారు. 2014 జూన్ 2 ముందు నియమంచబడి ఇప్పటివరకు కొనసాగుతున్న కాంట్రాక్ట్ ఉద్యోగులు అందరినీ రెగ్యులర్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించిన ఫైలుపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పంద్రాగస్టు రోజున సంతకం చేశారు. ఈ నియామకాలకు సంబంధించి నాలుగైదు రోజుల్లో ఉత్తర్వులు వెలువడనున్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయం పట్ల ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ చైర్మన్ కాకర్ల వెంకట రామిరెడ్డి ధన్యవాదాలు తెలిపారు.

Advertisement

Next Story