APL Session-3: భారీ లక్ష్యం.. రెండు పరుగుల తేడాతో ఓటమి

by srinivas |   ( Updated:2024-07-07 02:06:23.0  )
APL Session-3: భారీ లక్ష్యం.. రెండు పరుగుల తేడాతో ఓటమి
X

దిశ ప్రతినిధి, విశాఖపట్నం: వైజాగ్‌ వేదికగా ఆంధ్ర ప్రీమియర్‌ లీగ్‌ (ఏపీఎల్‌) సీజన్‌– 3లో భాగంగా గోదావరి టైటాన్స్, బెజవాడ టైగర్స్‌ జట్లు మధ్య మ్యాచ్‌ జరిగింది. పీఎం పాలెం డా. వైఎస్సార్‌ ఏసీఏ–వీడీసీఏ అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియం వేదికగా జరిగిన ఐపీఎల్‌ లీగ్‌ మ్యాచ్‌లో గోదావరి టైటాన్స్, బెజవాడ టైగర్స్‌ టీమ్‌లు తలపడ్డాయి. కేవలం ఒక్క పరుగు తేడాతో గోదావరి టైటాన్స్‌ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత టాస్‌ గెలిచిన బెజవాడ టైగర్స్‌ బౌలింగ్‌ ఎంచుకొని బరిలోకి దిగింది. బ్యాటింగ్‌ బరిలోకి దిగిన గోదావరి టైటాన్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో అల్‌ ఔట్‌ అవ్వగా 225 పరుగులు చేసి గట్టి పోటీని ఇచ్చారు.

ఈ సీజన్‌‌లో ఇప్పటి వరకు ఇదే భారీ స్కోరుగా నమోదైంది. ఓపెనర్‌ బ్యాట్సె్మన్లు కెప్టెన్‌ సి.ఆర్‌. జ్ఞానేశ్వర్‌ 41, ఎం.వంశీ కృష్ణ 45 పరుగులు చేసి అర్థ సెంచరీకి చేరువలో ఔట్‌ అయ్యారు. తరువాత దిగిన పి. పాండురంగరాజు 24 బంతుల్లో 4 సిక్సులు, 3 ఫోర్లు తో 51 పరుగులు చేసి అర్థ సెంచరి చేశాడు. అదే విధంగా ఎం. హేమంత్‌ రెడ్డి రెట్టింపు ఉత్సాహంతో 22 బంతుల్లో 5 సిక్సులు, 5ఫోర్లు తో 60 పరుగులు చేసి ఔరా అనిపించే రీతిలో బ్యాటింగ్‌ చేశాడు. తరువాత దిగిన వారంతా అంతగా రాణించలేక స్వల్ప పరుగులుతో అందరు ఔట్‌ అయ్యారు. అయినప్పటికీ బెజవాడ టైగర్స్‌ టీమ్‌ ముందు బలమైన 225 పరుగుల స్కోరును ముందు నిలిపారు.

చివరి వరకు పోటీ ఇచ్చిన బెజవాడ టైగర్స్‌.....

బ్యాటింగ్‌ బరిలోకి దిగిన బెజవాడ టైగర్స్‌ గడిచిన 20 ఓవర్లలో 6 వికెట్ల కోల్పోయి లక్ష్యానికి చేరువలో 224 పరుగులు చేసి కేవలం రెండు పరుగుల తేడాతో ఓడిపోయింది . ఓపెనర్‌ బ్యాట్సె్మన్లు అంతగా రాణించలేకపోయినప్పటికీ స్వల్ప స్కోరుతో వికెట్లు నష్టపోయారు. మిడిల్‌ ఆర్డర్‌‌లో దిగిన కె. ధీరజ్‌ లక్ష్మణ్‌ 23 బంతుల్లో 3 సిక్సులు, 6ఫోర్లు తో 46 పరుగులు చేసి అర్థ సెంచరికి చేరువలో ఔట్‌ అయ్యారు. తరువాత దిగిన పైలా అవినాష్‌ మాత్రం గ్రౌండ్‌లో బంతితో చెలరేగిపోయారు. 58 బంతుల్లో 11 సిక్సులు, 2ఫోర్లతో 105 పరుగులు చేసి చివరి వరకు జట్టు విజయానికి కృషి చేస్తూ నాట్‌ అవుట్‌‌గా బరిలో నిలిచారు.. ఈ సీజన్‌లో మొదటి సెంచరి చేసి మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌‌గా నిలిచారు. అయినప్పటికీ అంతా భారీ లక్ష్యానికి కేవలం రెండు పరుగుల తేడాతో ఓడిపోయింది.

Advertisement

Next Story

Most Viewed