- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
పవన్‌ను ఓడించేందుకు వైసీపీ బిగ్ స్కెచ్.. రంగంలోకి ఆమె..!
దిశ, విశాఖపట్నం ప్రతినిధి: విశాఖ జిల్లా గాజువాక అసెంబ్లీ నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్ధిగా విశాఖ నగర మేయర్ గొలగాని హరి వెంటక కుమారి పేరు దాదాపుగా ఖరారైంది. గత ఎన్నికల్లో ఈ నియోజక వర్గం నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను ఓడించి వైఎస్సార్ కాంగ్రెస్‌కు చెందిన తిప్పల నాగిరెడ్డి విజయం సాధించారు. అయితే ఈ పర్యాయం ఆయనకు టికెట్ నిరాకరించిన అధిష్టానం యాదవ సామాజిక వర్గానికి చెందిన కార్పొరేటర్ ఉరికూటి రామచంద్రరావును నియమించింది.
అయితే ఆ నియామకం పట్ల శాసనసభ్యుడు నాగిరెడ్డి నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. రామచంద్రరావుకు తాము సహకరించేది లేదంటూ నాగిరెడ్డి అడ్డం తిరగడంతో అధిష్టానం మరో మార్గం లేక అదే సామాజిక వర్గానికి చెందిన మేయర్ హరి వెంటక కుమారి అభ్యర్ధిత్వానికి మొగ్గు చూపింది. గాజువాకకు చెందిన చినతల్లి పేరును నాగిరెడ్డి వర్గం ప్రతిపాదించినప్పటికీ అధిష్టానం అంగీకరించలేదని తెలిసింది. ఒకటి రెండు రోజుల్లో వెలువడనున్న ఐదవ జాబితాలో మేయర్ పేరు ప్రకటించనున్నారని తెలుస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి...