కూటమి ప్రభుత్వ ‘పవర్ ఇంజన్’ పవన్ కల్యాణే: మాజీ మంత్రి

by Gantepaka Srikanth |   ( Updated:2024-09-05 12:55:27.0  )
కూటమి ప్రభుత్వ ‘పవర్ ఇంజన్’ పవన్ కల్యాణే: మాజీ మంత్రి
X

దిశ, వెబ్‌డెస్క్: జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియా(ఎక్స్) వేదికగా ప్రముఖులు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు, మంత్రులు నారా లోకేష్, నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేశ్ సహా ఎంపీలు, ఎమ్మెల్యేలు అనేకమంది విష్ చేశారు. తాజాగా.. మాజీ మంత్రి గంటా శ్రీనివాస రావు.. నెట్టింట పవన్ కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఆసక్తికర పోస్టు పెట్టారు. ‘గెలుపు, ఓటములకు వెరవని వ్యక్తిత్వం. నిజాయితీకి నిలువుటద్దం. అన్యాయాన్ని ప్రశ్నించే ఆవేశం. ఎదిగినా కొద్దీ ఒదిగి ఉండే మనస్తత్వం, మంచితనం. రాజకీయ రంగస్థల చరిత్ర చరిత్ర ఎరుగని విధంగా వందశాతం స్ట్రైక్ రేట్‌తో ప్రత్యర్థుల నోళ్లు మూయించి విజయానికే కొత్త నిర్వచనాన్ని పరిచయం చేసిన పొలిటికల్ గేమ్ చేంజర్. కూటమి ప్రభుత్వ పవర్ ఇంజన్, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గారికి హార్థిక జన్మదిన శుభాకాంక్షలు’ అని గంటా శ్రీనివాస రావు ట్వీట్ పెట్టారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Click Here For Twitter Link


Advertisement

Next Story

Most Viewed