Good News: ఏపీలో రోడ్ల సమస్యకు త్వరలో పరిష్కారం

by srinivas |
Good News: ఏపీలో రోడ్ల సమస్యకు త్వరలో పరిష్కారం
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీలో రోడ్ల సమస్యకు త్వరలో పరిష్కారం లభించబోతోందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే కొడాలి నాని తెలిపారు. టీడీపీ చేపట్టిన గుంతల రోడ్ల నిరసనపై ఆయన స్పందించారు. రామాయణంలో పిడకల వేటలా పనికి మాలిన టీడీపీ, జనసేన నేతలు రోడ్లపైకి వస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ధనికుల కార్లు బ్రేకులు వేయకుండా రోడ్లపై తిరగాలన్నదే ప్రతిపక్ష నాయకుల ఆరాటమని ఎద్దేవా చేశారు. పేదలను సీఎం జగన్ ఆత్మబంధువుగా భావస్తారని తెలిపారు. అందుకే పేదల అవసరాలు తీర్చేందుకు సీఎం జగన్ అధిక ప్రాధాన్యత ఇస్తారని చెప్పారు. చంద్రబాబు హయాంలో మాదిరి ఒక్క విడత పథకం ఆపితే రోడ్ల సమస్య పరిష్కరించవచ్చని తాము సీఎం జగన్ చెప్పామని కొడాలి నాని తెలిపారు.


అయితే ప్రాణం పోయినా తాను ఇచ్చిన మాటను తప్పని సీఎం జగన్ మోహన్ రెడ్డి తెలిపారని నాని పేర్కొన్నారు. గుడివాడ ప్రజల తాగు నీటి అవసరాలు, ఇళ్ల స్థలాల కోసం టీడీపీ హయాంలో ఒక్క ఎకరా అయినా సేకరించారా అని ప్రశ్నించారు. అలా సేకరించామని నిరూపిస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని కొడాలి నాని సవాల్ విసిరారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్, సీఎం జగన్ మోహన్ రెడ్డి గుడివాడ ప్రజల కోసం 625 ఎకరాల భూమి కొనుగోలు చేశారని నాని వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed