- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
TDP అధికారంలోకి రాగానే తొలి సంతకం ఆ ఫైల్‌పైనే: చంద్రబాబు కీలక ప్రకటన
దిశ, వెబ్‌డెస్క్: నిరుద్యోగులకు టీడీపీ చీఫ్, మాజీ సీఎం చంద్రబాబు కీలక హామీ ఇచ్చారు. రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి రాగానే మెగా డీఎస్సీ ఫైల్ పైనే తొలి సంతకం పెడతానని ప్రకటించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం ప్రకాశం జిల్లా మార్కపురం ప్రజాగళం బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. సీఎం జగన్ ఐదేళ్లు ఆంధ్రప్రదేశ్‌కు రాజధాని లేకుండా చేశాడని మండిపడ్డారు. వెలిగొండ నిర్వాసితులకు నష్ట పరిహారం ఇవ్వలేదని.. జగన్ పోలవరాన్ని గోదారిలో కలిపేశాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. నవరత్నాల పేరిట జగన్ నవ మోసాలు చేశాడని ఎద్దేవా చేశారు. ఐదేళ్లలో బటన్ పేరిట జగన్ నొక్కిందెంత.. బొక్కిందెంత అని ప్రశ్నించారు. టీడీపీ అధికారంలోకి వస్తే మార్కాపురాన్ని కొత్త జిల్లాగా చేస్తామని చంద్రబాబు కీలక హామీ ఇచ్చారు. టీడీపీ హయాంలో సంక్షేమానికి పెద్దపీట వేశామని గుర్తు చేశారు. జగన్ పాలనలో నాసిరకం మద్యం తాగి ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు గెలవాలంటే ఎన్డీఏ కూటమిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.