- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నటి జత్వానీ కేసులో సజ్జలకు ఏం సంబంధం?: అంబటి రాంబాబు
దిశ, వెబ్ డెస్క్: ఏపీలో ముంబై నటి జత్వానీ కేసు ప్రకంపనలు సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ఈ కేసులో ఇద్దరు ఐపీఎస్‌లు, గత ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డిపై ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో వారిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తనను వైసీపీ నాయకుడు విద్యాసాగర్ వేధించినట్లు మరోవైపు ముంబై నటి జత్వానీ ఆరోపించారు. ముంబై నుంచి విజయవాడకు చేరుకున్న బాధితురాలు బాధితురాలు జత్వానీ పోలీసులకు ఫిర్యాదును చేశారు. దీంతో పోలీసులు లోతైన విచారణ జరుపుతున్నారు. అటు ప్రభుత్వం కూడా సీరియస్ అయింది. నిందితులను కఠినంగా శిక్షించాలని ఆదేశించింది.
ఈ నేపథ్యంలో మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు స్పందించారు. నటి కేసులో సజ్జల రామకృష్ణారెడ్డికి ఏం సంబంధమని ప్రశ్నించారు. సజ్జలపై కూటమి ప్రభుత్వం అక్కసు వెళ్లగగ్గుతోందని వ్యాఖ్యానించారు. జత్వానికి విషయంలో చంద్రబాబు, పవన్ సర్కార్‌కు బూమరాంగ్ తప్పదని అంబటి రాంబాబు హెచ్చరించారు. వైసీపీని నేతలు వీడుతున్న పరిణామాలపైనా ఆయన స్పందించారు. పార్టీ నుంచి ఎవరు పోయినా నష్టం లేదన్నారు. నిజాయితీ ఉన్న నాయకులు పార్టీలు మారరని తెలిపారు. రాజకీయ వలసలను ప్రోత్సహించడం చంద్రబాబుకు అటవాటేనని విమర్శించారు. ఉత్తరాంధ్రలో వైసీపీ ఎంపీటీసీలు, జెడ్పీటీసులు బలంగా నిలవడం వల్లే ఎమ్మెల్సీగా బొత్స గెలవగలిగారని చెప్పారు. స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులను చూసైనా పార్టీ ఎంపీలు బుద్ధి తెచ్చుకోవాలని మోసిదేవి వెంటక రమణ, బీద మస్తాన్ రావును ఉద్దేశించి అంబటి రాంబాబు సెటైర్లు వేశారు.